Thursday, May 16, 2024

ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్న బిజెపి

- Advertisement -
- Advertisement -

ప్రగతిశీల శక్తులే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి
సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా

హైదరాబాద్ : భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక స్ఫూర్తిని బిజెపి ద్వంసం చేస్తుందని, ప్రగతిశీల శక్తులే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా పిలుపునిచ్చారు. యావత్ దేశానికే అత్యంత ప్రమాదకరమైన ప్రజాస్వామ్య నైతికతకు మోడీ ప్రభుత్వం కోలుకోలేని నష్టం కలిగించిందని అయన తెలిపారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ లాంటి భారత రాజ్యాంగ సృష్టికర్తలను అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడం ద్వారా బిజెపి ప్రతి భారతీయుని మనోభావాలను దెబ్బతీసిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. బిజెపి దుర్మార్గపు చర్యలను చూసి దేశ ప్రజలు బిజెపిని ఎప్పటికీ క్షమించరని అయన పేర్కొన్నారు.

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం మాజీ ఎఐఎస్‌ఎఫ్ నాయకులు బాలకృష్ణ, పందుల రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎఐఎస్‌ఎఫ్ మాజీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఎఐఎస్‌ఎఫ్ మాజీ నేత ఉమా మహేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమ్మేళనానికి సయ్యద్ అజీజ్ పాషా ముఖ్యఅతిథిగా హాజరు కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాల మల్లేష్, ఏఐఎస్‌ఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు , అప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్, సినీ దర్శకుడు బాబ్జి, ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకులు బొమ్మగాని ప్రభాకర్, అన్వర్ పాషా, తిప్పర్తి యాదయ్యలు పాల్గొని ప్రసంగించారు.

అంతకుముందు ఆగస్ట్ 12న ఎఐఎస్‌ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సందర్భంగా సయ్యిద్ అజీజ్ పాషా జెండా ఆవిష్కరణ చేసి ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాజకీయ అధికారం కోసం బీజేపీ ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజించడం చేస్తుందని, దీనితో దేశంలో అసహనం, అశాంతి నెలకొన్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ ధోర ణిలతో ‘ప్రతీకార రాజకీయాలను‘ అవలంబిస్తూ అణిచివేత, మూక దాడులను, హింసను ప్రోత్సహిస్తుందని అయన మండిపడ్డారు. బీజేపీ ‘ఫాసిస్ట్‘ పాలనను అంతం చేయడానికి, భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడేందుకు రాజ్యాంగ అనుకూల, లౌకిక మరియు ప్రజాస్వామ్య భారతదేశాన్ని విశ్వసించే ’ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్ర’ శక్తులందరు ఏకమై ‘భారతదేశ ఆత్మను‘ రక్షించుకోవాలని సయ్యిద్ అజీజ్ పాషా పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News