Wednesday, May 1, 2024

బ్రిజ్ భూష్ప లైంగిక వేధింపుల కేసు..సాక్ష్యాలు సరిపోతాయన్న ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో అతడిపై బలమైన సాక్ష్యం ఉందని, ఆ ఆధారం సరిపోతుందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూష్ప నమోదైన కేసులో ఉన్న ఆధారాలు సరిపోతాయని ప్రభుత్వ న్యాయవాది అతుల్ కుమార్ శ్రీవాత్సవ ద్వారా పోలీసులు కోర్టుకు నివేదించారు. దాంతో, అతడికి కోర్టులో ఎలాంటి శిక్ష పడనుందనేది త్వరలోనే తెలుస్తుంది.

రెండు రోజలు క్రితం బ్రిజ్ భూషన్ న్యాయవాది చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఎలాంటి లైంగిక వాంఛ లేకుండా ఒక క్రీడాకారిణిని కౌగిలించుకోవడం లైగింక వేధింపుల కిందకు రాద’ని భూషణ్ లాయర్ అన్నాడు. అయితే.. ‘ఏ ఉద్దేశంతో బ్రిజ్ భూషణ్ సదరు అమ్మాయిని హత్తుకున్నాడనేది ముఖ్యమ’ని శ్రీవాత్సవ కోర్టుకు తెలిపాడు.

భజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్

మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన భూష్ప చర్యలు తీసుకోవాలని వినేశ్ ఫోగట్ నేతృత్వంలో రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. భజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ వంటి స్టార్ మల్లయోధులు నెల రోజులకు పైగా పోరాటం చేశారు. ఎట్టకేలకు పోలీసులు బ్రిజ్ భూష్ప ఎఫ్‌ఐఆర్ రిజిష్టర్ చేయడంతో తమ పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News