Sunday, April 28, 2024

8న కర్నాటకలో తొలి బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బిజెపి) తన అభ్యర్థుల తొలి జాబితాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నది. ఢిల్లీలో మే 7న బిజెపి సెంట్రల్ పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ జరుగనున్నది, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్నాటక అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.
అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే పూర్తిచేశారు. బ్యాలెట్ ఓటింగ్ ద్వారా గెలిచే అభ్యర్థులు ఎవరనే దానిపై తమ శక్తి కేంద్ర చీఫ్‌ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ప్రతి శక్తి కేంద్ర నాలుగు నుంచి ఐదు పోలింగ్ బూత్‌లను కవర్ చేయనున్నది. ప్రతి పోలింగ్ బూత్‌లో 1200 నుంచి 1800 మంది ఓటర్లు ఉండనున్నారు. పెద్ద ఓటు బ్యాంకును పొందేందుకు 60 ఓటర్లు ఉండే కుటుంబాలపై దృష్టి పెట్టే బాధ్యతను ప్రముఖ్‌లకు ఇచ్చారు.

బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు అయిన ధర్మేంద్ర ప్రధాన్, శోభా కరంద్‌లజే, ప్రహ్లాద్ జోషి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్. యెడియూరప్ప, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్, సిటి. రవిలకు బాధ్యతలు అప్పగించింది. వారు జిల్లా ప్రధాన కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల సందర్భంగా అట్టడుగు స్థాయి వరకు వెళ్లి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా వీరు పనిచేయనున్నారు.

బిజెపి ఎంపిక చేయనున్న అభ్యర్థుల్లో 15 శాతం మంది ఇప్పుడున్న సిట్టింగ్ ఎంఎల్‌ఏలను తీసేయనున్నారు. అది కూడా వారి నియోజకవర్గాల్లో వారి పనితీరు ఆధారంగా. అభ్యర్థులను వ్యూహాత్మకంగా ఎంపికచేయబోతున్నామని బిజెపి రాష్ట్ర ప్రతినిధి గణేశ్ కార్నిక్ తెలిపారు. 224 సభ్యుల కర్నాటక అసెంబ్లీలో కనీసం 150 సీట్లయినా దక్కించుకోవాలన్న వ్యూహంతో బిజెపి అభ్యర్థులను నిలబెట్టబోతున్నది.

BJP list-Karnataka

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News