Monday, April 29, 2024

రాందేవ్ వ్యాఖ్యలపై ఎయిమ్స్‌లో బ్లాక్‌డే

- Advertisement -
- Advertisement -

‘Black Day’ in AIIMS on June 1 over Baba Ramdev's comments

 

న్యూఢిల్లీ : బాబా రాందేవ్ వ్యాఖ్యలను నిరసిస్తూ, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు మంగవారం నిరసనకు దిగుతున్నారు. ఇందులో భాగంగా తాము జూన్ 1వ తేదీని బ్లాక్‌డేగా పాటిస్తామని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. కరోనా రోగులకు చికిత్సలు అందిస్తున్న తమపై బాబా రాందేవ్ అవాకులు చెవాకులకు దిగారని, వీటిని తాము ఖండిస్తున్నామని , వ్యాక్సినేషన్ల ప్రక్రియపై ప్రజలలో అశాంతి కల్గించేలా మాట్లాడినందుకు ఆయనపై ఎపిడెమిక్ యాక్ట్ పరిధిలో కేసులు పెట్టి తగు చర్యలు తీసుకోవాలని సంఘం అధికారులకు విజ్ఞప్తి చేసింది. కరోనా చికిత్స విషయంలో అలోపతి వైద్యం విఫలం అయిందని, వ్యాక్సిన్లతో కరోనా తగ్గబోదని బాబా చెప్పడాన్ని సంఘం తప్పుపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News