Wednesday, May 15, 2024

సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు.. ఘనంగా మెగా రక్తదాన శిబిరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని నాగోల్ లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసం వద్ద మెగా రక్తదాన శిబిరంను ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే సంబరాలలో భాగంగా.. ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తతో పాటు తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ జన్మదినం సందర్బంగా ఈరోజు నాగోల్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ”ప్రతీ ఒక్కరం రక్తదానం చేద్దాం-ఆపదలో ఉన్నవారికి అండగా నిలుద్దాం” ఇదే మన ప్రజానాయకుడికి మనం అందించే అపూర్వ కనుక అని అన్నారు. సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న సిఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.

Blood Donation in Nagole on CM KCR’s Birthday Occasion

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News