Tuesday, April 30, 2024

నివాస భవనాన్ని హోటల్‌గా మార్చేశారు

- Advertisement -
- Advertisement -
BMC lodges police complaint against Sonu Sood
సోనూ సూద్‌పై పోలీసులకు బిఎంసి ఫిర్యాదు

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్(బిఎంసి) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా జుహులోని తన ఆరంతస్తుల నివాస భవనాన్ని హుటల్‌గా మార్చారంటూ సోనూ సూద్‌పై బిఎంసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిఎంసికి చెందిన కె-వెస్ట్ వార్డ్ సోమవారం జుహు పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని కె-వెస్ట్ వార్డ్ సహాయ మునిసిపల్ కమిషనర్ విశ్వాస్ మోతె ధ్రువీకరించారు. మహారాష్ట్ర ప్రాంతీయ, టౌన్ ప్లానింగ్(ఎంఆర్‌టిపి) చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు సోనూ సూద్‌పై ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. జుహులోని ఎబి నాయర్ రోడ్డులో ఉన్న తన నివాస భవనం శక్తి సాగర్ అపార్ట్‌మెంట్ కట్టడంలో మార్పులు చేసేముందు సూద్ అధికారుల అనుమతి తీసుకోలేదని తన రెండు పేజీల ఫిర్యాదులో బిఎంసి ఆరోపించింది.

సోనూ సూద్, ఆయన భార్య సోనాలీ సూద్ తమ నివాస భవనంలో మార్పులు చేపట్టే ముందు బిఎంసి అనుమతి తీసుకోలేదని, ఈ విషయమై గత ఏడాది అక్టోబర్‌లో సోనూ సూద్‌కు బిఎంసి నోటీసులు జారీ చేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది. గత సోమవారం తిరిగి ఆ స్థలాన్ని సందర్శించామని, నోటీసు అందుకున్నప్పటికీ అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తన ఫిర్యాదులో బిఎంసి తెలిపింది. అయితే.. సోనూ సూద్‌పై ఇప్పటివరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని జుహు పోలీసు స్టేషన్‌లోని వర్గాలు తెలిపాయి. అక్రమ కట్టడాలకు సంబంధించి బిఎంసి అధికారులు పూర్తి వివరాలు అందచేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి తెలిపారు.  అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలతో చిరపరిచితుడైన సోనూ సూద్ లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు అందచేసిన సేవలతో దేశవ్యాప్తంగా మానవతావాదిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News