Saturday, May 11, 2024

రైతులకు అండగా బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

వెల్దండ: రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటును సరఫరా చేస్తూ ,రైతుబంధు,రైతుబీమా తదితర పథకాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్ర సిఎం కేసిఆర్ రైతు బాంధవుడయ్యాడని, రైతులకు మూడు గంటలు చాలూ అంటున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు యెన్నం భూపతిరెడ్డి అన్నారు. తెలంగాణ రా ష్ట్ర పిసిసి అద్యక్షులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకి నిరసనగా మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు యెన్నం భూపతిరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ నాయకులు ర్యాలీగా మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు.

అనంతరం కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటు చాలు అని అన్న మాట లు రైతులు నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు అందిస్తుందని రైతులు అధైర్యపడొద్దని అ ని హామీనిస్తూ తహసిల్దార్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు.మండల పార్టీ అధ్యక్షులు యెన్నం భూపతిరెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రైతు బాంధవుడని , రైతుబంధు, రైతు బీమా , తదితర ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు.

కార్యక్రమంలో మండల రైతు సమన్వయ అధ్యక్షులు బాస్కరావు,సర్పంచులు శ్రీనూనాయక్,పత్యానాయక్, బి ఆర్‌ఎస్ నాయకులు క్యాసారపు వెంకటయ్య,నాగులునాయక్ ,శేఖర్ ముదిరాజ్,శ్రీనూనాయక్,ప్రసాద్,పిల్లి దేవెంద ర్, ఆర్కేగౌడ్, సామెల్, రాములు, బాల్‌లక్ష్మయ్య, షబ్బీర్ అ హ్మద్ బాబా,గజిని శ్రీనూ, ఆనంద్, జగన్,చందూ,యాదగిరి ,సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News