Tuesday, April 30, 2024

బిఎస్‌ఎఫ్ జవాన్ల కాల్పులలో ఇద్దరు బంగ్లాదేశీ స్మగ్లర్ల మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ జిల్లాలో చంగ్రబంధ సరిహద్దు పోస్టు వద్ద గస్తీ కాస్తున్న భారత దళాలపై బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్లు దాడి చేసిన ఘటనపై ఆ దేశానికి చెందిన బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బిజిబి) వద్ద భారత సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరగగా బిఎస్‌ఎఫ్ దళాలు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పులలో ఇద్దరు స్మగ్లర్లు మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న బిఎస్‌ఎఫ్ జవాన్లను దాదాపు 18-20 మంది బంగ్లాదేశీ స్మగ్లర్లు చుట్టుముట్టారని, జవాన్లపై దాడి చేసి గాయపరిచారని అధికారులు చెప్పారు. తమ ప్రాణాలకు ముప్పు తప్పదని గ్రహించిన జవాన్లు మరో ప్రత్యామ్నాయం లేక కాల్పులు జరిపారని బిఎస్‌ఎఫ్ ఉత్తర బెంగాల్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News