Sunday, April 28, 2024

‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

Budget

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎటువంటి గట్టి నిర్ణయాలు లేకుండా చప్పగా రూపొందిందనే విమర్శలకు పాత్రమవుతున్నది.

Budget-2020

budget-session-2020

Budget-2020-21

ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రతిపౌరుడికీ సాధికారతనిస్తుంది. – ప్రధాని మోడీ
మోడీ ప్రభుత్వం డొల్లతనం మరోసారి బయటపడింది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపలేదు:- రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: యావత్తు దేశం ఎంతో ఆసక్తి తో ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ రానే వ చ్చింది. 2020 21 ఆర్థిక సంవత్సరాని కి పద్దు కేటాయింపులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభ లో ప్రదేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జె ట్ అంటూ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రార ంభించిన నిర్మలమ్మ బడ్జెట్‌లో వ్యవసా యం, గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధా న్యం కల్పించారు. ఇందులో భాగంగానే రైతులకు ఉపయుక్తంగా ఉండే అనేక పథకాలను ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేలా సరికొత్త పథకాలను ప్రారంభించారు.

పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు లాంటి వాటి రవాణా కోసం కిసాన్ రైల్, కృషి ఉడాన్ లాంటి వినూతపథకాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి చిన్నతరహా ఎగుమతిదారులకు రక్షణ కల్పించే దిశగా ‘ నిర్విక్’ పేరుతో మరో పథకాన్ని ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే విధంగా పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. ఈ మేరకు పన్ను శ్లాబ్‌లసంఖ్యను పెంచారు. పాత శ్లాబులను కొనసాగిస్తూనే కొత్త శ్లాబులను ప్రవేశపెట్టారు. వీటిలో ఏది ఎంచుకోవాలన్నది చెల్లింపుదారుడి అభిమతమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొ త్తం మీద కొత్త విధానంలో పన్ను రాయితీలతో కలుపుకొని రూ.5 లక్షల దాకా వార్షికాదాయం ఉన్న వారు ప న్ను చెల్లించనక్కర లేదు. దాదాపు రెండున్నర గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ 2020 21 బడ్జెట్ ప్రతిపాదనలు, తదుపరి లక్షాలతో పాటు గత అయిదున్నరేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు.

మధ్య మధ్యలో తమిళ కవులను ఉటంకిస్తూ ప్రసంగం సాగింది. ‘సబ్‌కా సాత్.. సబ్‌కా విశ్వాస్’ ఇదే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేద ప్రజలకు అందేలా కృషి చేస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. 2020 21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.30.42 లక్షలకోట్ల వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి 201920 ఆర్థిక సంవత్సరానికి రాబడి లక్షాలను చేరుకోలేక పోయినందున బడ్జెట్ లోటు ముందు నిర్ణయించుకున్న 3.3 శాతంనుంచి 3.8 శాతానికి పెరిగిపోవచ్చని అవచనా వేశారు.

ప్రజల ఆదాయాలు, పెట్టుబడులను పెంచే విధంగా ఈ బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించినా, ఇప్పటికే 5 శాతం దిగువకు పడిపోయిన జిడిపి వృద్ధిని పెంచేందుకుగాను అన్ని రంగాలకు అన్నీ ఇచ్చామనే విధంగా బడ్జెట్ ప్రసంగం ఉన్నప్పటికీ వాస్తవానికి చూస్తే శుష్కప్రియాలు శూన్యహస్తాలేనని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలకు అద్దం పడుతోంది. ఇక కార్పొరేట్ వర్గాల మనోభావాలకు గీటురాయిగా భావించే స్టాక్ మార్కెట్లు బడ్జెట్‌పై ఏ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఫలితంగా మార్కెట్లు కుప్ప కూలాయి. రెండున్నర గంటల వ్యవధిలోనే లక్షలాది కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది.

ఆదాయం పన్ను శ్లాబుల్లో మార్పులు

ఆదాయం పన్ను రేట్లలో తగ్గింపు వల్ల ఏడాదికి రూ.17 లక్షల దాకా ఆదాయం ఉండే వ్యక్తులకు దాదాపు రూ.31వేల దాకా ఆదా అవుతుంది. అయితే కొత్త విధానంలో 80సి, 80డి, ఎల్‌టిసి, హెచ్‌ఆర్‌ఎ, స్టాండర్డ్ డిడక్షన్, బీమా ప్రీమియం, పిఎఫ్, పింఛన్ ఫండ్ వంటి మినహాయింపులు ఉండవు. మొత్తం గా కొత్త విధానంలో వంద దాకా ఉన్న పన్ను రాయితీల్లో 70 వరకు తొలగించారు. అలాగే రూ.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారు రిబేటుతో కలుపుకొంటే పన్ను చెల్లించనక్కర లేదు. అలాగే చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు ఏడాది పాటు టాక్స్ హాలిడేను ్ల ప్రకటించారు. కార్పొరేట్ కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్(డిడిటి)ని రద్దు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనివల్ల కంపెనీలకు రూ.25 వేల కోట్ల వరకు ఆదా అవుతుందనన్నారు. దీనితో పాటు బ్యాంకు డిపాజిట్లపై బీమా సదుపాయం పరిమితిని ఇప్పుడున్న రూ.1లక్షనుంచి రూ.5 లక్షలకు పెంచారు. అలాగే దేశంలో అతి పెద్ద బీమా సంస్థ అయిన ఎల్‌ఐసిలో ప్రభుత్వ వాటాను విక్రయిస్తామని ప్రకటించారు.

సాగుకు ఊతం

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నినాదాన్ని మరోసారి వినిపించిన ఆర్థిక మంత్రి ఆ దిశగా సాగు రంగానికి నిధులు కేటాయింపు జరిపే ప్రయత్నం చేశారు. రైతులకోసం 16 సూత్రాల ప్రణాళికను ప్రకటించి వంద కరవు జిల్లాల కోసం ప్రత్యేక సాయం కోసం ప్రణాళికలను రూపొందిస్తామ న్నారు. ఉన్నత విద్యలో ప్రపంచ దేశాలకు భారత్ గమ్య స్థానం కావాలని చెప్పిన నిర్మలమ్మ ‘ స్టడీ ఇన్ ఇండియా’ప్రాజెక్టులో భాగంగా ఆసియా, ఆఫ్రికా దేశా ల్లో ‘ఇండ్‌శాట్ ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామ న్నారు.

ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ను సాంకేతికంగా మరో మెట్టు ఎక్కించే విధంగా త్వరలోనే కొత్త ఆర్థిక వ్యవస్థను తీసుకు వస్తామని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రకటించారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ‘ ఫైబర్ టు హోం’ కనెక్షన్స్ ద్వారా ఈ ఏడాది లక్ష గ్రామపంచాయతీలను అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనికి గాను వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 6 వేల కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ప్రముఖ పర్యాటక కేంద్రాలను కలిపేందుకు భవిష్యత్తులో మరిన్ని తేజస్ తరహా రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైల్వే మారాల పక్కన ఉండే సొంత భూముల్లో పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పా టు చేస్తామన్నారు. పిపిపి పద్ధతిలో 150 రైళ్లను నడపనున్నామని తెలిపారు.

2020-21 బడ్జెట్ ముఖ్యాంశాలు

 నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం
కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ఈ ప్రభుత్వ లక్ష్యం
ఎఫ్‌డీఐలు 284 బిలియన్ డాలర్లకు చేరాయి
వర్షాభావ జిల్లాలకు అదనపు నిధులు

విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కొత్త కోర్సులు
ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం
భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు
ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ
కొత్తగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్..

 యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ఏర్పాటు
ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్
మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం
ఎలక్ట్రానిక్, మాన్యుఫాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి
మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
రంగాలవారీగా కేటాయింపులివే..

 జల్‌జీవన్ మిషన్‌కు రూ 11,500 కోట్లు
విద్యారంగానికి రూ 99.300 కోట్లు
నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు రూ1480 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ 9500 కోట్లు
టూరిజం ప్రోత్సాహానికి రూ 2500 కోట్లు
సాంస్కృతిక శాఖకు రూ 3150 కోట్లు

Budget 2020 Highlights

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News