Sunday, April 28, 2024

రైల్వే ప్రైవేటు బాట

- Advertisement -
- Advertisement -

Railway to private

 

న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి ఈ కొత్త రైళ్ల ఏర్పాటు దిశలో సంస్థలను లేదా ప్రైవేటు వ్యక్తులను ఎంపిక చేసి , వారిని ఆహ్వానించే ప్రక్రియ ఇప్పుడు సాగుతోందని వివరించారు. రైల్వే మంత్రిత్వశాఖ కేటాయింపులు, రైల్వేల సంబంధిత ప్రతిపాదనలు చేశారు. 202021 కేంద్ర బడ్జెట్‌లోభాగంగా భారతీయ రైల్వేలకు సంబంధించి భారీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు చేశారు. ఇక ప్రైవేటు భాగస్వామ్యంతో నాలుగు రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. పర్యాటక కేంద్రాలను కలుపుతూ మరిన్ని తేజస్ రైళ్లను తీసుకురానున్నారు. న్రముఖ పర్యాటక స్థలాలను రైలు మార్గాల ద్వారా కలిపేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తేజస్ రైళ్లు ఇప్పటికే పూర్తి స్థాయి ప్రైవేటు రైళ్లుగా పేరొందాయి. దేశంలో ఇప్పుడు రెండు తేజస్ రైళ్లు నడుస్తున్నాయి.

గత ఏడాది ఢిల్లీ లక్నో మార్గంలో దీనిని ప్రవేశపెట్టారు. ఇటీవలే ముంబై అహ్మదాబాద్ మార్గంలో మరో తేజస్‌ను ప్రారంభించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నాయకత్వంలోని మంత్రిత్వశాఖ రైల్వేల భద్రతపై దృష్టి సారిస్తుందని వివరించారు. మంత్రిత్వశాఖ తీసుకుంటున్న చర్యలతో రైల్వేలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి వివరించారు. ఇటీవలి కాలంలో సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్ సమర్పణ జరుగుతూ వస్తోంది. రైల్వే పట్టాల వెంబడి ఉండే రైల్వే విస్తారిత భూములలో సౌర విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఈ ఇంధన ఉత్పత్తి ఏర్పాట్లు చేసే యోచన పరిశీలనలో ఉందన్నారు.

ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ ట్రైన్ పనులు వేగవంతం చేస్తారు. దేశంలో పిపిపి పరిధిలో మొత్తం 1150 రైళ్లనునడపనున్నారు. రైల్వే స్టేషన్లలో 550 వైఫై సౌకర్యాలను కల్పిస్తారు. ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను 2023 నాటికి పూర్తి చేస్తారని మంత్రి తెలిపారు. 27 వేల కిలోమీటర్ల రైలుమార్గాన్ని విద్యుద్దీకరించాలని లక్షంగా పెట్టుకున్నారు. రూ 18,600 కోట్లతో 148 కిలోమీటర్ల మేర బెంగళూరు సబర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు, మెట్రో తరహాలో ప్రయాణ ఛార్జీలు ప్రతిపాదించనున్నట్లు తెలిపారు.

ఈసారి రైల్వే బడ్జెట్ కేటాయింపులను రూ 70,000 కోట్లుగా ఖరారు చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక మూల ధన వ్యయం కింద రూ 1.61 లక్షల కోట్లు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఇది 3 శాతం పెరుగుదలగా నమోదైంది. 201920 బడ్జెట్‌లో మూల ధన వ్యయం రూ 1.56 లక్షల కోట్లుగా ఉంది. అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే ఇది 17.2 శాతం పెరుగుదల . అయితే ఈసారి ఇది కేవలం 3 శాతం పెరుగుదలగానే ఉంది. రైల్వేలకు సంబంధించిన పూర్తి స్థాయి వసూళ్లు అంటే ప్రయాణికుల నుంచి , సరుకుల రవాణా, ఇతరత్రా విభాగాలు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు నుంచి వచ్చే వాటిలో 9.5 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరిత అంచనాలు (ఆర్‌ఇ)లతో పోలిస్తే ఈ హెచ్చింపు ఉంటుందని భావిస్తున్నారు.

ఈసారి బడ్జెట్‌లో కొత్త రైల్వే మార్గాలకు రూ 12000కోట్లు
202021 బడ్జెట్‌లో రైల్వే కొత్త లైన్ల కోసం రూ 12000 కోట్లను ఖరారు చేశారు. రూ 2250 కోట్లను గేజ్‌ల మార్పిడికి, రూ 700 కోట్లను డబ్లింగ్ పనులకు , రైల్వే కోచ్‌లు , విడి పరికరాలకు రూ 5786.97 కోట్లను, సిగ్నలింగ్ , టెలికంకు రూ 1650 కోట్లను కేటాయించారు. ఈసారిసరుకు రవాణా సామర్థం 1,265 ఎంటిలుగా అంచనా వేశారు. ఇప్పటితో పోలిస్తే ఇది 3.4 శాతం ఎదుగుదల.

ప్రయాణికుల ద్వారా ఆదాయం రూ 61000 కోట్లుగా, సరుకు రవాణా ద్వారా వచ్చేవసూళ్లను రై 1,47000 కోట్లుగా అంచనావేశారు. ఇక రైతుల దిగుబడులకు ఇబ్బంది కలుగకుండా, శీతలీకరణ కోచ్‌లలో గమ్యాలకు చేర్తే కృషి రైలును కూడా తీసుకువస్తున్నారని మంత్రి తెలిపారు. పిపిపి పరిధిలో దీనిని ప్రవేశపెడుతారు. రైల్వేలకు సంబంధించి వచ్చే ఆదాయంలో ఖర్చు భారంగా మారుతోంది. ఉద్యోగులు అదనపు సిబ్బందికి అయ్యే వేతన భత్యాల ఖర్చు రూ 92,993.07 కోట్లుగా అంచనావేశారు.

Railway to private
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News