Friday, April 26, 2024

గోడలు కాదు.. వంతెనలు కట్టు

- Advertisement -
- Advertisement -

Build bridges not walls: Rahul Gandhi

 

కేంద్రానికి రాహుల్ హితవు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో గత రెండున్నర నెలలకు పైగా ఆందోళన సాగిస్తున్న రైతుల నిరసనల వేదికలకు చేరువలో పోలీసులు బ్యారికేడ్లు, ఇనుప తీగెల కంచెలను ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. నాలుగు పదాల వాక్యంతో ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. వంతెనలు నిర్మించండి.. అడ్డు గోడలు కాదు అంటూ రాహుల్ మంగళవారం ప్రభుత్వానికి హితవు పలుకుతూ ట్వీట్ చేశారు.

ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేస్తున్న నిరసన ప్రదేశాల వద్ద పోలీసుల మోహరింపు పెరగడం, బ్యారికేడ్ల ఏర్పాటు పటిష్టం కావడంతో అవి పోలీసుల వలయంగా మారుతున్నాయి. ఢిల్లీ శివార్లలోని ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద పోలీసులు నాలుగు వలయాలతో ఇనుప తీగెల కంచెలు ఏర్పాటు చేసి నిరసనకారులు ఘాజీపూర్-మీరట్ హైవేను దాటుకుని ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో పోలీసుల మోహరింపు ఉధృతమైంది.

సింఘూ సరిహద్దుల వద్ద ప్రధాన రహదారిపై రెండు వరుసలలో సిమెంట్ బ్యారికేడ్లు ఉంచి, వాటి మధ్యగొలుసులతో ఇనుప రాడ్లను పోలీసులు ఏర్పాటుచేశారు. అదే రహదారిపై సరిహద్దుకు అవతల వైపున సిమెంట్ గోడను నిర్మించి రహదారిని పూర్తిగా బ్లాక్ చేసినట్లు వార్తసంస్థలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఢిల్లీ సరిహద్దుల్లో తాజాపరిస్థితిపై స్పందిస్తూ ప్రధానమంత్రిజీ&మన రైతులపైనే యుద్ధమా? అంటూ నిలదీశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News