Monday, April 29, 2024

ఏడు బహుళ ట్రాక్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఏడు బహుళ ట్రాక్ (మల్టీ ట్రాకింగ్ )ప్రాజెక్టులకు కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ. 32,500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల వల్ల రైలు ఆపరేషన్లలో రద్దీ తగ్గి, ప్రయాణ,

రవాణా సౌకర్యాల్లో మరింత వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. దేశం లోని తొమ్మిది రాష్ట్రాల్లో 35 జిల్లాలకు ఈ పథకం విస్తరిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఈ పథకం అమలు కానుంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్ 2339 కిమీ వరకు విస్తరిస్తుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News