Tuesday, April 30, 2024

హెచ్ 1 వీసాకు లాటరీ ప్రక్రియే

- Advertisement -
- Advertisement -

California court overturns Trump-led H1B visa selection process in US

ట్రంప్ సంకల్పిత ఆదేశాల కొట్టివేత

వాషింగ్టన్ : అమెరికాలో ట్రంప్ హయాంలో తలపెట్టిన హెచ్ 1 బి వీసా ఎంపిక ప్రక్రియను అక్కడి కాలిఫోర్నియా కోర్టు కొట్టివేసింది. దేశంలో అమలులో ఉన్న వీసాల జారీ లాటరీ సిస్టమ్ స్థానంలో వేతన స్థాయి ఆధారిత ఎంపిక ప్రక్రియకు అప్పట్లో ట్రంప్ యంత్రాంగం సంకల్పించింది. అయితే సంబంధిత నిబంధన జారీ దశలో అప్పటి హోంల్యాండ్ భద్రతా వ్యవహారాల అధికారి ఛాడ్ వోల్ఫ్ చట్టబద్ధంగా సర్వీసులో లేరని, దీనితో అప్పటి ఆర్డినెన్స్ చెల్లుబాటులోకి రాదని, దీనిని కొట్టివేస్తున్నామని కాలిఫోర్నియా జిల్లా కోర్టు జడ్జి జెఫ్రీ ఎస్ వైట్ రూలింగ్ వెలువరించారు. వీసాల జారీలో కొత్త ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి వెంటనే రూలింగ్ ఇవ్వాలని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన అభ్యర్థనకు కోర్టు సమ్మతించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించినట్లు కోర్టు ఆదేశాలను ఛాంబర్స్ లిటిగేషన్ సెంటర్ వెబ్‌సైట్‌లో పెట్టారు. అమెరికాలో హెచ్ 1 బి వీసాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంది.

సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రతిభలను కొలమానంలోకి తీసుకుని విదేశాలకు చెందిన వారిని ప్రత్యేక స్థానాలలోకి అమెరికా కంపెనీలు తీసుకోవడానికి హెచ్ 1 బివీసాలనే ప్రాతిపాదికగా తీసుకుంటారు. ప్రతి ఏటా జారీ చేనసే ఈ వీసాల పరిమితి 65వేలు పై బడి ఉంటుంది. అదనంగా అదనపు డిగ్రీలు ప్రతిభా పాటవాలున్న వారికోసం మరో 20వేల హెచ్ 1 బి వీసాలను రిజర్వ్ చేసి ఉంచుతారు. ప్రస్తుత వీసా జారీ విధానం మొదటి ప్రాధాన్యత, ముందు వచ్చిన వారికి ఇవ్వడం, లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ వస్తోంది. అయితే దేశాధ్యక్షులుగా ట్రంప్ తమ తుది దశలో ఉన్నప్పుడు ఈ పాతపద్ధతి లాటరీ విధానాన్ని ఎత్తివేస్తామని ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ మేరకు అమెరికా ఇమిగ్రేషన్, పౌరసత్వ విభాగం ( యుఎస్‌సిఐఎస్) ప్రకటన వెలువరించింది. అమెరికన్ల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా చేసుకుంటూ అత్యంత నైపుణ్యపు విదేశీ వర్కర్లకు వీసాలు జారీ చేయాలని ఇందులో ప్రతిపాదించారు.

అయితే ఇటువంటి విధానంలో తాము ఎక్కువ సంఖ్యలో ప్రతిభావంతులైన విద్యావంతులను ఉద్యోగాలలోకి తీసుకోవడం కష్టం అవుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీలు అభ్యంతరం తెలిపాయి. కోర్టులను ఆశ్రయించాయి. ఈ దశలోనే సంబంధిత అంశంపై అమెరికా వాణిజ్య పరిశ్రమల సమాఖ్య కూడా ఈ పిటిషన్ల సత్వర విచారణకు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ విధంగా కోర్టు రూలింగ్ వెలువరించింది. అప్పటి హెచ్ 1 బి వీసా విధానపు కేటాయింపులు నిజానికి ఈ ఏడాది మార్చి 9వ తేదీన అమలులోకి రావాలి. అయితే బైడెన్ అధికార యంత్రాంగపు నియంత్రణల కట్టడితో అంతర్గత భద్రతా వ్యవహారాల విభాగం (డిహెచ్‌ఎస్) ఈ అమలును ఈ ఏడాది చివరి వరకూ నిలిపివేసింది. తుది నిబంధనల దశలో సంబంధిత అధికారి వోల్ప్‌కు చట్టబద్ధత లేదని, అప్పుడు వెలువడ్డ నిబంధనలు చెల్లుబాటు కిందికి రావని కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News