Wednesday, May 1, 2024

త్వరలో డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో కార్ల పంపిణి

- Advertisement -
- Advertisement -

Cars distribution

 

హైదరాబాద్: రాష్ట్రంలో మైనారిటీ యువతకు ప్రవేశపెట్టిన డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో కార్లు పంపిణి చేయడానికి ప్రాథమిక కసరత్తు జరుగుతుందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2017 నుండి సిఎంకెసిఆర్ ముస్లిం మైనారిటీలకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో కార్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు 300 కార్ల పంపిణి చేయడానికి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించామని వివరించారు.

చిరాగ్ పథకం ద్వారా ముస్లిం యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ:
రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ యువతి, యువకులకు కంప్యూటర్ కొర్సులల్లో చిరాగ్ పథకం ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నాంపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో ఉచిత శిక్షణ కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాలల్లో ఈ పథకం ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తెవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు వేసవి సెలవుల సందర్భంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారులకు అదేశాలను జారీ చేస్తామన్నారు.

Cars distribution in owner cum driver scheme
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News