Sunday, May 5, 2024

అవినాశ్ రెడ్డి లేఖపై స్పందించిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంపి అవినాశ్ రెడ్డి లేఖపై సిబిఐ స్పందించింది. అవినాశ్ రెడ్డి విజ్ఞప్తిని సిబిఐ అధికారులు తిరస్కరించారు. అవినాశ్ రెడ్డిని వెంటనే విచారణకు హాజరుకావాలని సిబిఐ ఆదేశించింది. సిబిఐని నాలుగు రోజుల గడువు కోరారు. సిబిఐ నుంచి అవినాశ్ రెడ్డికి ఫోన్ రాగానే హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లినట్టు సమాచారం. సిబిఐ విచారణకు హాజరు కాలేనట్టు లేఖ పంపారు. అవినాశ్ రెడ్డికి ఎవరు పోన్ చేసి ఉంటారని సరత్రా ఆసక్తి నెలకొంది. పులివెందులలో అరెస్ట్ అయితే రాజకీయంగా కలిసివస్తుందని అవినాశ్ రెడ్డి భావిస్తున్నారు. సిబిఐ అధికారులు పులివెందులకు బయలుదేరారు. అవినాశ్ రెడ్డి విచారణకు హాజరుకావడం ఇది ఐదో సారి. ఈ హత్యకేసులో ఎంపి అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసి జైలు తరలించిన విషయం విధితమే.

Also Read: అది పెద్దగా ఉంటే చాలు.. అలాంటి భర్తే కావాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News