Tuesday, April 30, 2024

కరోనా వైరస్ జీవం లేని మహామ్మరీ: సిసిఎంబి మాజీ డైరెక్టర్

- Advertisement -
- Advertisement -

corona

కరోనా వైరస్ జీవం లేదని మహామ్మరీ అని సిసిఎంబి మాజీ డైరెక్టర్ మోహన్‌రావు అన్నారు. కరోనా పరిస్థితులపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…జంతువుల నుంచి సంక్రమించిన వైరస్ మానవ జాతిపై విరుచుకుపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ఆన్‌ఎన్‌ఏకి సంబంధించిన వైరస్ అని, ఇది కణాల్లోకి వెళ్లి విడిపోతుందని ఆయన తెలిపారు. సాధారణంగా వైరస్‌లు అన్ని నిర్జీవ పదార్థం కలిగిన జీవులని అన్నారు. ఇది మానవ శరీరంలోని ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తన కణాలను రెట్టింపు చేస్తుందన్నారు. వైరస్ ముందుగా మానవ గొంతులోకి వెళ్తుందని, అక్కడ నుంచి ఊపిరితిత్తులలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఈక్రమంలో వేడి నీళ్లు తరచుగా త్రాగడం వలన వైరస్ నేరుగా కడుపులోకి వెళ్లిపోయే అవకాశం ఉందని, అక్కడ విడుదలయ్యే ఆమ్లాలు వలన వైరస్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. అంతేగాక వైరస్‌లు అన్ని అధిక ఉష్ణోగ్రతలో వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉంటుందని, ఈ కరోనా వైరస్ కూడా అధిక ఉష్ణోగ్రతల వలన వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కానీ, ప్రస్తుతం ఎక్కడ ప్రూఫ్ లేకపోవడంతో రిపోర్టులు బయటకు రావడం లేదన్నారు. ప్రస్తుతం సిసిఎంబిలో భారతదేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఆర్‌ఎన్‌ఏ, ఇటలీ, చైనా, అమెరికాలో వ్యాప్తి చెందుతున్న వైరస్‌లు ఒకటేనా? అని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా ఆన్‌ఎన్‌ఏకి ఆర్టీపిసిఆర్ పరీక్షలు ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించి క్రమంగా కణాలపై దాడి చేస్తూ 14 రోజుల్లో క్షిణింపచేస్తాయని, అందుకే అనుమానిత లక్షణాలు ఉన్నవారు 14 రోజుల పాటు స్వీయ నియంత్రణ పాటిస్తే మేలని ఆయన సూచించారు. ఈ వైరస్‌కి ఎలాంటి మందు లేకపోవడంతో, తాత్కాలికంగా క్లోరొక్విన్, ఎయిడ్స్ రోగులకు ఇచ్చే డ్రగ్స్‌ను ఇస్తూ వ్యాధిని కంట్రోల్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

CCMB Former Director Speaks with Media on Corona

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News