Monday, May 6, 2024

కరోనా వేళ… సామూహికం వద్దు.. ఇంపుగా ఇంటిబోనం!

- Advertisement -
- Advertisement -

Celebrate state festival Bonalu at home

 

మహమ్మారిని దూరం చేసేందుకు రాష్ట్ర పండుగ బోనాలను వైభవంగా ఇంట్లోనే జరుపుకుందాం l ఇదే నెలలో వైరస్ విజృంభిస్తుందని నిపుణుల హెచ్చరికలు l ఉత్సవాల సమయంలో జంట నగరాల్లో రోడ్లపై లక్షలాది మంది భక్తులు గుమికూడే అవకాశం l గుంపుల్లో కలిసి తిరిగితే కరోనా కాటు వేసే ప్రమాదం

ప్రపంచమే అబ్బుర పడేలా ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకునే తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక పండుగ బోనాలు ఈ దఫా గతంలో మాదిరిగా ఘనంగా నిర్వహించుకునేలా పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రపంచానికి నిద్దుర లేకుండా చేసిన కరోనా మహమ్మారి జూన్ నెలలో మరింతగా విజృంభించే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు రావడంతో ఈసారి బోనాల వైభవాలు ఇండ్లకే పరిమితమై తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను కాపాడుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నెల 25 నుంచి తొమ్మిది రోజుల పాటు జంట నగరాల్లో అత్యంత వైభవంగా బోనాలు ఉత్సవాలు జరగాల్సి ఉంది. కాని కరోనా వ్యాధి విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తుండడంతో ఆ మహమ్మారికి చిక్కకుండా ఉండాలంటే ఇండ్లలోనే మహంకాళి దేవతను పూజించుకోవాల్సిన వాతావరణం నెలకొన్నది. కరోనా వ్యాధి దరిచేరకుండా ఉండాలంటే రోడ్లపైకి సామూహికంగా రాకూడ దు. వచ్చినా ఎక్కువ సమయం గుంపుల్లో కలిసి మెలిసి తిరగకూడదు.

సమూహాల్లో ఎక్కువ సమ యం గడిపితే అంతగా కరోనా కాటేస్తున్న అనుభవాలు తెలంగాణలోనూ కనిపిస్తున్న నేపథ్యంలో లక్షల మంది జనం బయటికి వచ్చే, గుమికూడే బోనాల ఉత్సవాలు జరపకపోవడమే ఉత్తమమని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతున్నది. బో నాలు ఉత్సవమంటేనే సామూహికం. 9 రోజుల పాటు నగర ప్రజలంతా గుంపులుగా, ర్యాలీలుగా రోడ్లపైకి వస్తారు. అమ్మవారికి ఘనంగా బోనం అర్పిస్తారు. గత ఏడాది దాకా ఈ వైభవం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. సర్వ మతాల పండుగలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ ప్రభుత్వం కూడా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న ది. సెక్యులరిజం అక్షరాల ఫరిడవిల్లే విధంగా అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించడమే కాకుండా ఆ వర్గాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తున్నది. ముస్లింల రంజాన్, క్రైస్తవుల క్రిస్మస్ నుంచి, హిందువులు జరుపుకునే అన్ని పండుగలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి.

చివరకు ఇవే పండుగలను ఖం డాంతరాల్లో ఉన్న తెలంగాణ పౌరులు కూడా తె లంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధం గా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ మన సంస్కృతిని చాటి చెపుతున్నారు. హిందువులు జ రుపుకునే పండుగల్లో బోనాల పండుగకు అత్యంత విశిష్టత ఉంది. ఇది తెలంగాణ అంతటా జరుపుకుంటున్నా జంట నగరాల్లోనే ఈ పండుగ అత్యం త సంబురాల మధ్య జరుగుతుంది. ఈ పండుగ ప్రాముఖ్యతను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుర్తించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అత్యంత వైభవంగా జరిగేలా సౌకర్యాలు, నిధులు సమకూర్చడమే కాకుండా తొలిసారి బంగారు తెలంగాణ కోసం బం గారు బోనంను సమర్పించారు. సిఎం కెసిఆర్ తెలంగాణ సమా జం సామూహికంగా జరుపుకునే బోనాలే కాకుం డా అన్ని పండుగలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలు భారీ ఎత్తున సంబురాలు చేసుకునే ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పే బోనాలు పండుగకు ఈసారి కరోనా ముప్పు ఎదురయింది. పండుగను మునుపటిలా సామూహికంగా జరుపుకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్న ది. జంట నగరాల్లోని గోల్కొండలో ప్రారంభమై 9 రోజుల పాటు తొమ్మిది దేవాలయాల్లో మహంకాళి దేవత లక్షలాది మంది ప్రజలు సమర్పించే బోనం అందుకుంటుంది. ముఖ్యంగా మహిళలు, టీనేజీ అమ్మాయిలు ప్రత్యేక వస్త్ర ధారణతో బోనంతో ఊరేగింపులో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో పోతరాజు విన్యాసాలు, రంగం జోస్యం, ఘట్టాల ఊరేగింపు లాంటివన్నీ కన్నుల పండుగ చేసేవే. లక్షలాదిగా ప్రజలు సామూహికంగా పాల్గొనేవే. కాని ఈ సారి కరోనా బోనాలు ఉత్సవానికి అడ్డంకిగా మా రింది. ప్రపంచమంతా ఆరడుగుల భౌతిక దూరా న్ని పాటిస్తూ, గంట గంటకూ చేతులు కడుక్కుం టూ, గుంపులకు దూరంగా ఒంటరిగా ఉంటున్న సమయంలో లక్షల సమూహాలతో పండుగ చేసుకోవడం తెలంగాణ ప్రజల ప్రాణాలకు సంకటమే. మహంకాళి దేవతను ఎప్పటిలా భక్తులంతా తమ ఇండ్లలోనే ఘనంగా జరుపుకుంటే తెలంగాణ సమాజాన్ని కరోనా రక్కసి నుంచి రక్షించినట్లే.

గడిచిన నెలలో ముస్లింలు కూడా రంజాన్‌ను ఇండ్లలోనే ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించారు. ప్రార్థనలను, సామూహిక పండుగలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కారణంగా ఆంక్షలు విధించడాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని అంతా భావిస్తున్నారు. బోనాలులో బోనం అందుకునే ఏడు అక్కాచెల్లెళ్లైన మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, మారెమ్మ, నూకాలమ్మలను దేవతలను ప్రజలు ఇండ్ల నుంచే సాంప్రదాయికంగా పూజించుకొని బోనాలు సమర్పించాలి. తెలంగాణ బంగారు తెలంగాణగా మారే క్రమంలో భక్తి విశ్వాసాలు పరిరక్షించుకుంటూనే కరోనాకు చిక్కకుండా బోనాలు పండుగను వినూత్నంగా ఇండ్లలోనే జరుపుకోవడం ద్వారా తెలంగాణ సమాజం ఉద్యమాలు, ఉద్వేగాల్లోనే కాకుండా క్రమశిక్షణలోనూ, ప్రభు త్వం పట్ల విశ్వాసం ప్రదర్శించడంలోనూ ముందుంటుందని ప్రపంచానికి చాటి చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News