Wednesday, May 1, 2024

‘సత్వర సాగు నీటి పథకాలకు’ తాపీగా నిధులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంపై కేంద్రం మరో వివక్ష, సాగు నీటి ప్రాజెక్టులకు ఇవ్వాల్సింది కొండంత.. ఇస్తున్నది గోరంత

నిధుల కొరతతో నష్టపోతున్న శ్రీరామ్ సాగర్ వరద కాలువ,
ఎస్‌ఆర్‌ఎస్‌పి 2వ దశ, దేవాదుల, రాజీవ్ భీమా ఎత్తిపోతల

పిఎం కెఎస్‌వై పథకాల పనుల
అంచనా రూ.23314కోట్లు
ఇప్పటివరకూ ఖర్చు
రూ. 19212కోట్లు కేంద్రం
ఇచ్చింది రూ.3929
భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే
ఈ నిధులిస్తే పనులు
పూర్తయ్యేదెప్పటికో!

మన తెలంగాణ/హైదరాబాద్ : నీటి వినియోగపు సామర్ధ్యాన్ని మెరుగుపరిచి వ్యవసాయ ఉత్పాదక ఉత్పత్తిని పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలు నామమాత్రపు నిధుల విదిలింపులతో దశాబ్ధాల తరబడి కొనసాగుతున్నాయి. నిర్మాణం లో ఉన్న, చివరి దశకు చేరువలో ఉన్న పథకాలను సత్వరం పూర్తిచేయించి ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు అప్పటి ప్రభుత్వం 1996లో సత్వర సాగునీటి పథకం (ఏఐబిపి) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పధకం కింద తెలంగాణలో శ్రీరాంసాగర్ వరద కాలువ, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండవ దశ, దేవాదుల, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. కేంద్ర జలశక్తి శాఖ, ప్రణాళిక కమీషన్ ద్వారా అనుమతులు పొందిన భారీ, మధ్యతరహా సాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిచేసేందుకు ఉద్దేశించిన ఏఐబిపి పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పేరుమార్చివేసింది. ఈ నాలుగు సాగునీటి పథకాను ప్రధానమంత్రి కిసాన్ సంచాయక యోజన పథకం(పిఎంకేఎస్‌వై)కింద అమలు చేస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వం ఈ పథకం కింద రాష్ట్రానికి నామమాత్రపు నిధుల విధిలింపులతోనే సరిపెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. పిఎంకెఎస్‌వై కింద ప్రభుత్వం రాష్టంలో నాలుగు పథకాలు చేపట్టింది. కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుల ద్వారా 6,02,491లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరందించాలన్నది లక్షంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.23,314 కోట్లు వ్యయం కాగలవన్న ప్రాధమిక అంచనాలతో పనులు ప్రారంభించింది. ఈ పథకాల పనులపై ఇప్పటివరకూ రూ.19,212కోట్ల వ్యయం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.3929 కోట్లు మా్రత్రమే ఇచ్చింది. నిధుల వ్యయంలో సింహభాగం రాష్ట్రప్రభుత్వమే మోస్తువస్తోంది. రాష్ట్రఖాజాను వస్తున్న రాబడుల్లోనే పిఎంకేఎస్‌వై పధకాలకు పనులకు నిధులు సర్దుబాటు చేసుకుంటూ వస్తోంది. ఈ పధకాలకు చేసిన నిధుల వ్యయంలో రూ.15283కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సివచ్చింది.

రెండు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కేంద్రం అరకొరగా ఇస్తున్న నిధులతో ఈ పథకాల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు స్టీలు , సిమెంట్‌తోపాటు ప్రాజెక్టు పనులకు అవసరమైన అన్ని రకాల వ్యయాలు ఏటేటా పెరిగిపోతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రీతిన నిధులు ఇస్తూ పోతే ఇవి ఎన్నటికి పూర్తికావాలన్నది అంతుబట్టటం లేదంటున్నారు. ప్రతిపాదిక ప్రాజెక్టుల కింద ఎంపిక చేసిన 6.02లక్షల హెక్టార్ల ఆయకట్టులో ఇప్పటివరకూ పాక్షికంగా మొత్తం 2,95,711హెక్టార్లకు మాత్రమే సాగునీరందుతోంది. మిగిలిన ఆయకట్టుకు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కృష్టి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన రీతిలో సహకారం అందటం లేదంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సంచాయ యోజన పథకం కింద చేపట్టిన సాగునీటి పథకాల్లో శ్రీరాం సాగర్ వరద కాలువ నిర్మాణం కోసం రూ. 5940కోట్లతో ప్రాధమిక అంచనా వేయగా అందులో ఇప్పటివరకూ రూ.4,403కోట్లు వ్యయం జరిగింది. ఈ పథకం పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ రూ.328కోట్లు అందింది. మొత్తం 93587హెక్టార్ల ఆయకట్టుకు నీరిందించాలన్నది లక్షం కాగా, ఇప్పటివరకూ సుమారు 19451హెక్టార్లకు మాత్రమే నీరందుతోంది.

ఆదేవిధంగా శ్రీరాంసాగర్ రెండవ దశ పథకం పనులు రూ.1241కోట్ల అంచనాలతో చేపట్టగా, ఈ పథకం పనులపై ఇప్పటివరకూ రూ.938కోట్లు వ్యయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.178కోట్లు అందింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,78,066 హెక్టార్లకు సాగునీరందించాలన్నది లక్షం కాగా ఇప్పటివరకూ 1,47,695హెక్టార్లకు సాగునీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు రూ.13445కోట్ల అంచనాలతో చేపట్టగా, ఇప్పటివరకూ ఈ పథకం పనులపైన రూ.11830కోట్లు వ్యయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2138కోట్లు అందాయి. ఈ పథకం ద్వారా 2,48,695హెక్టార్లకు సాగునీటిని అందించాలన్నది లక్షం కాగా, ఇప్పటివరకూ 68747హెక్టార్లకు నీరందించగలిగారు. భీమా ఎత్తిపోతల పథకం పనులను రూ.688 కోట్ల వ్యయపు అంచనాలతో చేపట్టగా, ఈ పథకం పనులపై ఇప్పటివరకూ రూ.1948కోట్లు వ్యయం జరిగింది. కేంద్రం ఈ పథకానికి రూ1230కోట్లు అందజేసింది. ఈ పథకం ద్వారా 82,153హెక్టార్లకు సాగునీరందించాలన్నది లక్షం కాగా ఇప్పటివరకూ 59,818హెక్టార్లకు సాగునీటిని అందించగలిగారు. పిఎంకేఎస్‌వై పధకం కింద చేపట్టిన ఈ పథకాల పరిధిలో ఇంకా చాల చోట్ల సాగునీటి పంపిణీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీలు , పిల్ల కాలువల పనులు పూర్తి కాలేదు. కోన్ని చోట్ల భూసేకరణ పూర్తి కాలేదు.పలు చోట్ల పునరావాస పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

వేసవి ముగిస్తున్న కాల్వల ఆధునీకరణకు అందని నిధులు :

నీటిపారుదల రంగంలో సాగునీటి పథకాల పరిధిలో కాల్వల పూడికతీత , గట్ల పటిష్టత, తూముల రిపేర్లు వంటి పనులు చేపట్టేందుకు వేసవి కాలమే సరైన అదనుగా భావిస్తారు. ఈ సమయాన్ని వృధా చేసుకుంటే వర్షాకాలం పనులకు ఏమాత్రం వీలుపడదు. అంతే కాకుండా ఆయకట్టు అవసరాల కోసం మళ్లీ నీటివిడుదల చేయాల్సివస్తుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాల్వల ఆధునీకరణ పనులకు ఇవ్వాల్సిన రూ.340కోట్లు కూడా ఇవిగో అవిగో అంటూనే పొద్దుపుచ్చుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులకు సంబంధించి పలుమార్లు కేంద్రజల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకుపోయింది. కనీసం ఇకనైనా ఆయకట్టు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోని కేంద్ర ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News