Sunday, April 28, 2024

15 నుంచి స్కూళ్లు, సినిమా హాళ్లు

- Advertisement -
- Advertisement -

Central government that released the Unlock 5 code

 

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు
50% సీట్ల సామర్థంతో
థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు అనుమతి
పాఠశాలలపై రాష్ట్రాలదే నిర్ణయం
ఎగ్జిబిషన్, ఎంటర్‌టైన్‌మెంట్
పార్కులు తెరుచుకోవచ్చు
క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్‌పూల్‌లకు పర్మిషన్
అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ
విమానాలకు నో పర్మిషన్ n కంటైన్మెంట్
జోన్లలో లాక్‌డౌన్ యథాతథం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్‌లాక్ 5వ దశ మార్గదర్శకాలను ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెలువరించిన ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటివరకూ మూతపడి ఉన్న సినిమా హాళ్లు , స్కూళ్లు తెరిచేందుకు వీలు కల్పించారు. దేశంలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ తొలిగిపోయి, క్రమేపీ పరిస్థితులు మెరుగుపడుతూ ఉండటంతో వివిధ దశలలో అన్‌లాక్ ప్రక్రియలను కేంద్రం వెలువరిస్తూ వస్తోంది. ఇప్పుడు అన్‌లాక్ 5 దశలో భాగంగా దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు 50 శాతం కెపాసిటీతో అంటే సగం సీట్లు ఖాళీగా ఉంచి తెరిచేందుకు అనుమతి కల్పించారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలు సీటు వదిలి సీటు ప్రాతిపదికన సినిమా షోలు నిర్వహించుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలకు అనుమతిని ఇవ్వవచ్చు. కోవిడ్ ఉధృతి కారణంగా దేశంలో సామూహిక వైరస్ వ్యాప్తినియంత్రణ చర్యల దిశలో థియేటర్లు మూతపడ్డాయి.

దీనితో సినీ అభిమానులు తమ ఇష్టులైన సినిమా హీరోహీరోయిన్ల సినిమాలు చూసేందుకు, అదీ థియేటర్ల వాతావరణంలో చూసేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అయితే థియేటర్లు, స్కూళ్లను అక్టోబర్ 15వ తేదీ నుంచి పునః ప్రారంభించే విషయాన్ని సానకూలంగా పరిశీలించుకుని, తగు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఇప్పుడు అన్‌లాక్ 5 నిబంధనలను సడలించారు. గతితప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడీలో పెట్టేందుకు కేంద్రం అన్‌లాక్ ప్రక్రియ తీసుకు వచ్చింది.

వందమంది సమ్మేళనాలకు అనుమతి

ఇక రాష్ట్రాలు ఇకపై వంద మందికి పైగా జనం గుమికూడే మతపరమైన క్రతువులు, కార్యక్రమాలు, సామాజిక సాంస్కృతిక సమ్మేళనాలకు అనుమతిని ఇచ్చే దిశలో నిర్ణయాలు తీసుకోవచ్చు. క్రీడాకారుల శిక్షణకు వినియోగించుకునే స్విమ్మింగ్ పూల్స్‌ను తెరచి ఉంచవచ్చు. పూర్తి స్థాయిలో ఉండే బిజినెస్ టు బిజినెస్ (బి2బి) ఎగ్జిబిషన్లను కూడా అక్టోబర్ 15వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించుకోవచ్చు. ఈ మేరకు అన్‌లాక్ 5లో పలు వెసులుబాట్లు కల్పించారు. అక్టోబర్ నెల దేశవ్యాప్తంగా చాలా కీలకమైన మాసం. ఈ నెలలోనే విజయదశమి (దసరా) వస్తుంది. పలు ప్రాంతాల్లో దుర్గాపూజ నిర్వహణలో భాగంగా మండపాలు ఏర్పాటు అవుతాయి. అంతేకాకుండా బీహార్‌లో తొలిదశ పోలింగ్ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. ఈ దశలో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని కోవిడ్ నిబంధనలను , ప్రత్యేకించి భౌతికదూరం పాటింపులు, జనం గుమికూడకుండా ఉండటం , మాస్క్‌ల అనివార్యత వంటివి పరిగణనలోకి తీసుకుంటూ రీ ఓపెన్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు

మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ పాక్షిక అనుమతి

ప్రస్తుత అన్‌లాక్ పరిణామాల క్రమంలో దేశంలో మల్లిప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్ పాక్షికంగా తెరుచుకుంటాయి. అన్‌లాక్ 5 ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. పరిమిత స్థాయిలోనే రీ ఒపెన్‌కు వీలు కల్పిస్తున్నట్లు, వ్యాపార వాణిజ్య ప్రదర్శనలకు సంబంధించి వాణిజ్య విభాగం నుంచి ప్రామాణిక నిర్వాహక విధానాన్ని (ఎస్‌ఒపి) వెలువరించడం జరుగుతుందని తెలిపారు. స్విమ్మింగ్ పూల్స్ పునః ప్రారంభానికి పాటించాల్సిన పద్ధతులపై యువజనక్రీడల వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్థిష్టంగా నిబంధనలు వెలువరిస్తుంది. వినోదాత్మక ఉద్యానవనాలు పార్క్‌లు అటువంటి ఇతర స్థలాలను తిరిగి తెరిచేందుకు వీలు కల్పించారు. స్కూళ్ల రీఓపెన్‌కు సంబంధించి రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలు తగు నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాట్లు కల్పించారు. అక్టోబర్ 15 తరువాత వీటిపై నిర్ణయం తీసుకోవచ్చు. వీటిని దశల వారిగా ఓపెన్ చేసుకునేందుకు అనుమతిని ఇచ్చారు. స్థానిక పరిస్ధితులను లెక్కలోకి తీసుకుని విద్యాసంస్థలను తిరిగి తెరిచే విషయం, ఏ పద్ధతిలో వాటిని తెరవాలనేది నిర్ణయించుకోవచ్చు.

ఆన్‌లైన్ క్లాసు పద్ధతికి బ్రేక్‌లొద్దు

ఇప్పుడున్న ఆన్‌లైన్, దూరవిద్యాబోధన పద్ధతులను ప్రోత్సాహించాల్సిందే , ఈ మేరకు తగు విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆన్‌లైన్ విద్యాబోధనలో సాగుతున్న స్కూళ్లు , ఆన్‌లైన్ పద్ధతిలో చదువులకు అలవాటు పడ్డ విద్యార్థులు ఈ పద్థతినే కొనసాగించేందుకు అవకాశాలు కల్పించాలి. స్కూళ్లకు హాజరుకావడం కన్నా తాము ఇంటివద్దనే ఆన్‌లైన్ పద్థతిలో చదువుకుంటామంటే వారిని అదే విధంగా వెళ్లనివ్వాలి. విద్యార్థులు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల తగు లిఖిత పూర్వక అనుమతితోనే స్కూళ్లు లేదా బోధనా సంస్థలకు హాజరు కావల్సి ఉంటుంది.

హాజరీ పద్ధతిని పాటించాల్సిన అవసరం లేదు. పూర్తిస్థాయిలో తల్లిదండ్రుల అంగీకారంతోనే బడికి వచ్చే పిల్లలనే అనుమతించాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు స్కూళ్ల రీ ఒపెన్ దశలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సిన పద్ధతుల గురించి సొంతంగా మార్గదర్శకసూత్రాలను ఖరారు చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా మంత్రిత్వశాఖ, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం వెలువరించే ప్రామాణిక మార్గదర్శకాలు (ఎస్‌ఒపి) దృష్టిలో పెట్టుకుని తీరాలి. స్థానికంగా ఉండే ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు, యుటిలకు కల్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News