Sunday, May 5, 2024

కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Central govt arrangements for corona vaccine distribution

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. టీకా పంపిణీ సన్నద్ధతలో భాగంగా 4 రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ వాస్తవ పంపిణీలో సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ నెల 28,29న నాలుగు రాష్ట్రాల్లోని రెండు జిల్లాల చొప్పున డ్రై రన్ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Central govt arrangements for corona vaccine distribution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News