Tuesday, April 30, 2024

రైతుల మొత్తం డిమాండ్లు అంగీకరిస్తూ ప్రభుత్వం లేఖ

- Advertisement -
- Advertisement -
Central govt issues formal letter agreeing farmers
ఎస్‌కెఎంకు పంపిన కేంద్రం

న్యూఢిల్లీ : రైతుల పెండింగ్ డిమాండ్లు అన్నిటినీ నెరవేరుస్తామని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)కు లేఖ పంపింది. ఏడాదికి మించి సాగుతున్న ఉద్యమాన్ని ఆపివేయాలని లేఖలో కోరింది. ఈమేరకు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ఎస్‌కెఎంకు లేఖ రాశారు. ఆందోళనను విరమించాలని అందులో కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తరువాత అయిదు ప్రధాన డిమాండ్లు పెండింగ్‌లో ఉండడాన్ని ప్రస్తావించారు.

ఎంఎస్‌పి పై కమిటీని నియమిస్తామని ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించారని, కమిటీలో కేంద్రం తోపాటు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఉంటారని పేర్కొన్నారు. ఇందులో ఎస్‌కెఎం సభ్యులు కూడా ఉంటారని చెప్పారు. రైతులపై ఉన్న కేసులను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు అంగీకరించాయని లేఖలో వివరించారు. అలాగే అందోళనలో చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడానికి హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినట్టు పేర్కొన్నారు. విద్యుత్ సవరణ బిల్లు ప్రభావంపై ఎస్‌కెఎం తోను, ఇతర రైతు ప్రతినిధులతోను సంప్రదించకుండా పార్లమెంటులో ప్రవేశ పెట్టడం జరగబోదని కూడా లేఖలో హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News