Tuesday, April 30, 2024

బెంగాల్ నేతలకు కేంద్ర సెక్యూరిటీ

- Advertisement -
- Advertisement -

Central Security for Bengal Leaders

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్‌లో డజన్‌కు పైగా ఎమ్మెల్యేలు, ఎంపిలను విఐపి భద్రతా ఏర్పాట్ల వలయంలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు శనివారం తెలిపారు. అధికార టిఎంసి నుంచి ఇటీవలి కాలంలో బిజెపిలోకి చేరిన పలువురు కూడా ఈ సెక్యూరిటీ కవర్‌లోకి వచ్చారు. వీరికి ముప్పు పొంచి ఉందనే విశ్లేషణలు, కేంద్రీయ భద్రతా సంస్థల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖ భద్రతా ఏర్పాట్ల నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో సంచరించేటప్పుడు ఈ నేతలకు తక్కువ స్థాయి సెంట్రల్ విఐపి సెక్యూరిటీ ఏర్పాట్లు అయిన ఎక్స్, వై కేటగిరిలను కల్పిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భద్రతా బలగాల పరిధిలోనే ఈ సెక్యూరిటీ వలయం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News