Sunday, April 28, 2024

అవసరమైతే రాత్రి కర్ఫూ విధించాలి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

- Advertisement -
- Advertisement -

Centre Govt alert State over Omicron Variant

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేపధ్యంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే వెంటనే అక్కడి స్థానిక యంత్రాంగం వ్యూహాత్మక చర్యలు ప్రారంభించాలని, ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని, కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి, అవసరమైతే రాత్రి కర్ఫూ విధించాలని సూచించింది. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనే వారిపై పరిమితులు విధించాలని సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల సిఎస్‌లకు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం ఆ లేఖలో పేర్కొన్నారు. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలియచేశారు. మిగతా 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతంగా నమోదైనట్టు పేర్కొన్నారు.

Centre Govt alert State over Omicron Variant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News