Sunday, April 28, 2024

వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లకు పెంపు
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మద్దతు ధరల కోసం రూ.1,72,000 కోట్లు

న్యూఢిల్లీ: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతుల ఉత్పత్తుల్లో భారీ పెరుగుదల ఉందని చెప్పారు. వ్యవసాయ సంస్కరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు. 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధరలకు గాను రూ.1,72,000కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు. 2020-21లో 75 వేల కోట్ల రూపాయలు కేటాయించామని, దీనివల్ల కోటీ 50 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇక ఈ ఏడాది రైతు రుణాల లక్షం 16.5 లక్షల కోట్ల రూపాయలని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ అని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 40 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా మరో వెయ్యి మండీలను ఈ నామ్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అసోం, బెంగాల్‌లలో పని చేస్తున్న తేయాకు కార్మికుల కోసం 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి అలాగే సీ వీడ్ (నాచు) సాగును ప్రోత్సహించడం కోసం భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. రైతులు కోతల తర్వాత పంటలను నిల్వ చేసుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంకోసం, ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మరింత పెంచడం కోసం ఆర్థిక మంత్రి పలు వస్తువులపై వ్యవసాయ సెస్‌ను ప్రతిపాదించారు. పెట్రోల్, డీజిల్‌లపై ఈ సెస్ లీటరుకు రూ.2.50నుంచి 4 రూపాయలుండగా, మద్యంపై ఈ సెస్ వంద శాతం ఉండనుంది.

అయితే వ్యవసాయ సెస్ వల చాలా వస్తువుల ధరలు పెరగబోవని, వినియోగదారుడిపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులకు మరింత ఆదాయం సమకూర్చడం కోసం ప్రస్తుతం టమోటా, ఉల్లి, ఆలు లాంటి త్వరగా చెడిపోయే పంటలకు వర్తించే ‘ఆపరేషన్ గ్రీన్ ’పథకాన్ని మరో 22 ఇలాంటి త్వరగా చెడిపోయే ఉత్పత్తులకు వర్తింపజేయడం ద్వారా మరింతగా విస్తరించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. సీ వీడ్( నాచు) సాగు పరిశ్రమతో తీరప్రాంత వాసుల జీవితాలు మారిపోయే అవకాశముందని ఆమె అంటూ, తమిళనాడులో మల్టీపర్పస్ సీ వీడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటిస్తూ, కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతోందన్నారు.15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ ఉంటుందన్నారు.
గతంతో పోలిస్తే వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయన్నారు.2013 14ఆర్థిక సంవత్సరంలో గోదుమ రైతులకు రూ.33,874 కోట్లు చెల్లించగా, 2019 20లో రూ.62,802 కోట్లు, 2020 21లో రూ.75,060 కోట్లు చెల్లించామన్నారు. వచ్చే ఏడాది ఇది మరింత పెరుగుతుందన్నారు. అలాగే 2013 14ఆర్థిక సంవత్సరంలో వరి రైతులకు రూ.63,928 కోట్లు చెల్లించగా 2019 20లో రూ.1,41,930 కోట్లు, 2020-21లో రూ.1,72,752 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. పప్పు ధాన్యాలపైనా గతంలోకంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే పత్తి రైతులకు కూడా సరైన ప్రోత్సాహకాలు అందించామని చెప్పారు.

Centre to important for agriculture in Budget 2021-22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News