Monday, April 29, 2024

ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్: మమతా బెనర్జీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

సిలిగురి (పశ్చిమబెంగాల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలను మోసగించే ప్రజావ్యతిరేక బడ్జెట్ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. జాతీయత గురించి బిజెపి మాట్లాడుతుందని, కానీ ఆచరణలో జాతివనరులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తుందని ఆరోపించారు. కొత్తవ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను ఉద్ఘాటిస్తూ కొన్ని కోట్ల రూపాయల మొండిబకాయిలను రద్దు చేయగలుగుతుంది కానీ ఎందుకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేకపోతోందని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థల నుంచి బీమా, రైల్వే, పోర్టుల వరకు అన్నిటినీ విక్రయిస్తోందని విమర్శించారు. ఉత్తరబంగా ఉత్సవ ప్రారంభ సభలో ఆమె ప్రసంగించారు. బిజెపి శిబిరం లోకి టిఎంసి నేతలు కొందరిని కలుపుకోడానికి బిజెపి విమానాన్ని ఢిల్లీకి పంపుతోందని, కానీ వలస కార్మికులను స్వస్థలాకు పంపడానికి బిజెపి దగ్గర డబ్బులేక పోవడం విస్మయం కలిగిస్తోందని ఎద్దేవా చేశారు.

Anti People Budget 2021-22 by BJP: Mamata Banerjee

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News