Monday, April 29, 2024

రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తమ అధినేత చంద్రబాబును తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యనే అని మండిపడ్డారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఛార్జ్ షీట్‌లో లేని పేరును కావాలని చేర్చి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని దీన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 14 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని కీర్తించారు. అలాంటి బాబును నిరాధారమైన ఆధారాలతో అరెస్టు చేయడం జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందానికి నిదర్శనమని పర్లపల్లి రవీందర్ అన్నారు. వైసిపి ప్రభుత్వం చంద్రబాబునాయుడు ప్రాణాలకు హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో మాజీ సిఎం చంద్రబాబు నాయుడుకు అలాగే నారాలోకేష్‌లకు పాదయాత్రకు వస్తున్న ప్రజల ఆదరణను చూసి ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడని పర్లపల్లి రవీందర్ మండిపడ్డారు.

వైసిపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులపై చేస్తున్న దాడులు మానుకోవాలని అదే విధంగా చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని లేని పక్షంలో తెలంగాణ లో వున్న వైసిపి ఎమ్మెల్యేలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధులు సీమ మహేష్, అమరేందర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అజయ్, సవేందర్ నాయక్, చౌట గణేష్, హరి కృష్ణ, ఓం, కృష్ణ, శశాంక్, రాజు, పృథ్వి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News