Sunday, April 28, 2024

క్యూఆర్ కోడ్‌తో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -
Cheating with qr code in hyderabad
రూ.63 వేలు కొట్టేసిన సైబర్ నేరస్థులు

హైదరాబాద్: క్యూఆర్ కోడ్‌తో ఓ యువకుడి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ నేరస్థులు డబ్బులు కొట్టేశారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి బాగ్ అంబర్‌పేట శ్రీనివాస కాలనీకి చెందిన అక్షయ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. తన ఇంట్లోని సోఫాను విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో పెట్టాడు. దానిని కొనుగోలు చేస్తామని చెప్పి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఇది నిజమని నమ్మిన బాధితుడు సైబర్ నేరస్థుడు చెప్పినట్లు చేశాడు. తాను క్యూఆర్ కోడ్ పంపిస్తున్నానని దానిని స్కాన్ చేయాలని చెప్పాడు. బాధితుడు సైబర్ నేరస్థుడు చెప్పినట్లు చేయడంతో బ్యాంక్ ఖాతా నుంచి రూ.63,000 మాయం అయ్యాయి. మెసేజ్ చూసుకున్న అక్షయ్ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News