Sunday, April 28, 2024

బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు జిల్లా ప్రతినిధి: బిసి కులాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలుగులు నింపారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపి మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాష్ ఆలం, ఐడిడిఏ పిఓ అంకిత్ లతో కలిసి ములుగు, వెంకటాపూర్ మండలాల బీసి కులస్తులు 20 మందికి బిసి బంధు చెక్కుల పంపిణీ, రూ. 5 లక్షల రైతు బంధు చెక్కు పంపిణీ, గత నెలలో భారీ వర్షాల కారణంగా ఏటూర్ నాగారం మండలం కొండాయి గ్రామస్తులు వరదల్లో చిక్కుకుని మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ 5 లక్షల చొప్పున చెక్కులను మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ బిసి బంధు పథకం అమలు చేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయలను దుర్వినియోగం చేసుకోకుండా తెలివితేటలతో ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని పెంపొందించుకుని బాగా నడిపి ఎదగాలని అన్నారు. నియోజకవర్గానికి 300 మందికి మొదటి దశలో ఎంపిక చేసిన ప్రస్తుతం 20 మందికి అందజేయడం జరిగిందని తెలిపారు.

కొత్తగూడెం, గంగారం మండలాలకు 31 మందికి మిగతా మండలాలకు త్వరలో మండల ప్రజాప్రతినిధులు అధికారులతో త్వరలో మండల కేంద్రంలో అందిస్తామని అన్నారు. భారీ వానలు, వరదలు 16 మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, జిల్లా వ్యాప్తంగా తీరని చేదు అనుభవాన్ని మిగిల్చిందని అన్నారు. ఏటూర్ నాగారం మండలం కొండాయి గ్రామస్తులు వరదల్లో చిక్కుకుని మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశామని తెలిపారు. కొండాయి, బూర్గుపేట, మల్యాల, దొడ్ల, గ్రామాల ప్రజలకు ఇండియన్ ఆయిల్ సంస్థ బాధిత కుటుంబాలకు 10 లక్షల విలువ గల 19 రకాల సరుకులతో కూడిన 1000 కిట్లను మంత్రి అందజేశారు.

మహబూబాబాద్ ఎంపి కవిత మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల వలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన గ్రామాలలో సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సరియైన సమయంలో సహాయక చర్యలు చేపట్టి వరద నీటిలో కొట్టుకుపోయిన వారిన గుర్తించి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలచే వారిని కాపాడుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల వారిని ఏదో విధంగా కాపాడుకోవాలనే ఆశయంతో రాష్ట్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వారిని గుర్తించి వారికి బీసి బందును అందిస్తుందని అన్నారు.

జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం బాగుపడేలా జిల్లాకు మెడికల్ కాలేజిని మంజూరు చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని అన్నారు. రాష్ట్రంలో అనారోగ్యపరంగా కరోనా లాంటి విపత్తులు ఎదురైనా వాటిని ఎదిరించే విధంగా మెడికల్ కాలేజిలు, ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అద్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ములుగు, గోవిందరావు పేట, వెంకటాపూర్ ఎంపిపిలు గండ్రకోట శ్రీదేవి, సూడి శ్రీనివాస్ రెడ్డి, బుర్రి రజిత, జడ్పీటీసీలు గై రుద్రమదేవి, హరిబాబు, కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News