Thursday, November 30, 2023

ముసారాంబాగ్‌లో చిన్నారి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

Child kidnapped in Moosarambagh

హైదరాబాద్: రెండున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ సంఘటన నగరంలోని మలక్‌పేట, ముసారాంబాగ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బాలిక తల్లిదండ్రులు ఫుట్‌పాత్‌పై ఉంటూ చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. చెత్త ఎరుకుని ఫుట్‌పాత్‌పై బుధవారం రాత్రి నిద్రించారు. తెల్లవారుజామున లేచి చూసేసరికి పాప కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News