Saturday, April 27, 2024

పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం

- Advertisement -
- Advertisement -

President

 

గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం భారత్‌కు ఎంతో కీలకం, అయోధ్య తీర్పుపై ప్రజల పరిణతి అద్భుతం, సర్కార్ పథకాలకు హ్యాట్సాఫ్

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం చరిత్రాత్మకమైనదిగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రశంసిస్తూ, ఈ చట్టం చేయడం ద్వారా ప్రభుత్వం మహాతాగాంధీ ఆకాంక్షను నెరవేర్చిందని అన్నారు. అయితే నిరసనల పేరుతో హింసకు పాల్పడడాన్ని ఆయన ఖండిస్త్తూ, అది సమాజాన్ని, దేశాన్ని బలహీనం చేస్తుందని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రాష్ట్రపతి పరోక్షంగా ఈ నిరసనలనుద్దేశించి ఈ వ్యా ఖ్యలు చేయడం గమనార్హం. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉభయ సభల సభ్యులనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల సభ్యు లు ‘సిగ్గుసిగు’్గ అంటూ నినాదాలు చేయగా, అధికారపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా మంది నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజ్య సభలో ఆ పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌లు ముందు వరసలో తమకు కేటాయించిన స్థానాల్లో కాకుండా వెనుక వరసల్లో కూర్చోవడం ద్వారా తమ నిరసన తెలియ జేశారు. దాదాపు 70 నిమిషాల పాటు హిందీలో సుదీర్ఘంగా ప్రసంగించిన రాష్ట్రపతి పరస్పర చర్చలు, డిబేట్లు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ దశాబ్దాన్ని భారత దేశ దశాబ్దంగా, ఈ శతాబ్దాన్ని భారత దేశ శతాబ్దంగా చేయాలని కూడా రాష్ట్రపతి పిలుపునిచ్చారు. దేశ విభజన సమయంలో గాంధీజీ పాకిస్థాన్‌లో ఉండడానికి ఇష్టపడని హిందువులు, సిక్కులను భారత్‌కు రావచ్చని చెప్పారని, గాంధీ స్ఫూర్తితో పాకిస్థాన్‌లో ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం కల్పిస్తున్నామని, ఇది ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్రపతి అన్నారు.

సిఎఎ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని,అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని చేయడం ద్వారా పార్లమెంటు ఉభయ సభలు గాంధీజీ ఆకాంక్షను నెరవేర్చినందుకు తాను సంతోషిస్తున్నానని చెప్పారు. పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ, నాన్‌కానా సాహిబ్‌లో ఇటీవల ఏం జరిగిందో మనమంతా చూశామని అన్నారు. పాకిస్థాలో జరుగుతున్న అకృత్యాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావడం మనందరి కర్తవ్యం అని కూడా ఆయన అన్నారు.

ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తూ, మెరుగైన భవిష్యత్తు కోసం స్థానికంగా తయారయ్యే వస్తువులనే ఉపయోగించాని రాష్ట్రపతి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్య వస్థ పునాదులు బలంగా ఉన్నాయని, విదేశీ ద్రవ్య నిల్వ లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని కూడా ఆయన చెప్పారు. నవ భారత నిర్మాణమే లక్షంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేద ప్రజ సంక్షేమాన్ని దృష్టిలో ఉం చుకొని ప్రభుత్వం అనేక కొత్త పథకాలు తీసుకు వచ్చిందన్నారు. ఆర్టికల్ 370 నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఈ నిర్ణయం వల్ల జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు మరిం త అభివృద్ధి చెందుతాయన్నారు.

దేశంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు కశ్మీర్‌కు కూడా వర్తిస్తున్నాయన్నారు. సబ్‌కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అభివృద్ధి విషయంలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పా రు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులు భారీగా కేటాయించారని, అక్కడ రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నట్లు చెప్పారు. ఇటీవలే బోడో సమస్యను కూడా పరిష్కరించారని, ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగించారని చెప్పారు. గత అయిదేళ్లలో దేశంలో చేట్టిన కార్యక్రమాలు వల్ల భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, బ్యాంకింగ్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.

అయోధ్య అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రజాస్వీమ్య వ్యవస్థల పట్ల దేశ ప్రజలు ఉంచిన విశ్వా సం మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలోపేతం చేసిందన్నారు. వివాదాస్పద రామజన్మ భూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం దేశ ప్రజలు ప్రదర్శించిన పరిణతి, ఐక్యంగా వ్యవహరించడం హర్షణీయమన్నారు. తమ మౌలిక విధులను గుర్తుంచుకోవాలని దేశ ప్రజలను రాష్ట్రపతి కోరుతూ, మన రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడి హక్కులను కాపాడడంతో పాటుగా వారి విధులను కూడా గుర్తుంచుకోవాలని చెప్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన గత ఏడు నెలల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పలు చరిత్రాత్మక చట్టాలను చేయడం ద్వారా రికార్డు సృష్టించిందన్నారు. దేశంలో 27 వేల ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పామని చెప్పారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును సృష్టించడం ద్వారా త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం తీసుకు వచ్చామని రాష్ట్రపతి చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఈ విషయంలో భద్రతా దళాలకు స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు.

నల్ల బ్యాడ్జీలతో ప్రతిపక్షాల నిరసన
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్ట, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సికి నిరసనగా 14 ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు శుక్రవారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించినప్పుడు నల్ల బ్యాడ్జీలను ధరించి సభకు వచ్చారు. అంతే కాదు ఈ పార్టీలకు చెందిన సభ్యులంతా కూడా పార్లమెంటు సెంట్రల్ హాలులో ఒకే బ్లాక్‌గా కూర్చున్నారు. పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా రాజ్యాంగంపై ప్రభుత్వ దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలను ధరించినట్లు ప్రతిపక్షాల నేతలు చెప్పారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో పౌరసత్వ చట్టాన్ని ప్రశంసించినప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలియజేశారు. కొంతమంది సభ్యులు ‘ సిగ్గు, సిగ్గు’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా ఈ చట్టానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లు కూడా ప్రదర్శించారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన పార్టీల నేతల్లో కాంగ్రెస్‌తో పాటుగా ఎన్‌సిపి, సమాజ్‌వాది పార్టీ, డిఎంకె, ఆర్‌జెడి, సిపిఎం, సిపిఐ, శివసేన, జెఎంఎం, జెడిఎస్, ఆర్‌ఎస్‌పి, కేరళ కాంగ్రెస్( మణి గ్రూపు), ఎన్‌సిపి ఉన్నాయి.

పాత నినాదాల మూస ప్రసంగం : కాంగ్రెస్
రాష్ట్రపతి ప్రసంగం పాత నినాదాల చర్విత చర్వణంలాగా, మూప పద్ధతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దేశ ఆర్థిక పరిస్థితిపైన కానీ, ఉద్యోగాలు కోల్పోవడంపైన కానీ, నిరుద్యోగం పెరిగిపోవడంపై కానీ రాష్ట్రపతి ప్రసంగంలో ఒక్క మాట కూడా లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ట్విట్టర్‌లో దుయ్యబట్టారు.

Citizenship Amendment Act is Historic
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News