Monday, April 29, 2024

వృద్ధి రేటు 5%

- Advertisement -
- Advertisement -

survey

 ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే

ఆర్థిక సర్వే అంచనా

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5శాతంగా 201920 ఆర్థిక సర్వే అంచ నా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 66.5 శాతం ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దశాబ్దకాల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటును పెంచడానికి బడ్జెట్ లోటు లక్షాన్ని కాస్త సడలించాల్సిన అవసరం ఉందని సర్వే అభిప్రాయపడింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమై నాయి. తొలుత ఉభయ సభలను ద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. శనివారం 202021 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఒక రోజు ముందు సమర్పించిన ఆర్థిక సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక స్థితిగతులను సమీక్షించడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి చేయాల్సిన విధాన మార్పులతో పాటుగా ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై తగు సూచనలు చేసింది. ఆహార సబ్సిడీలో కోత విధించాలని, అదే సమయంలో సంపదతో పాటుగా ఉపాధి అవకాశాలను సృష్టించే వ్యాపారుల బాగోగులను చూడాలని కూడా సర్వే పిలుపునిచ్చింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని కూడా ఆర్థిక సర్వే పేర్కొంది.

కాగా వృద్ధి రేటు ఇంత తక్కువ నమోదు కావడం గత 11 సంవత్సరాల్లో ఇదే ప్రథమం. దీని కారణంగా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోనున్నాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ప్రభావం మన దేశంపై పడిందని, దానివల్లే పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. దానివల్ల ఆర్థిక రంగంలో తిరోగమన సంకేతాలు కనిపించాయని, దశాబ్ద కాలం నాటి పరిస్థితులు ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్నాయని అంచనా వేసింది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక అంతర లక్షాన్ని సడలించాల్సిన అవసరం ఉందని ఎకనామిక్ సర్వే అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరానికి ఆర్థిక లోటు లక్షాన్ని సవరించాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది.

పది కొత్త ఆలోచనలు

సంపద సృష్టిని పెంచడానికి, మార్కెట్లకు మేలు చేసే పది కొత్త ఆలోచనలను ఆర్థిక సర్వే సూచించింది. వచ్చే ఏడాది అభివృద్ధి పుంజుకోవాలంటే సంస్కరణల సరళిని బలంగా అనుసరించాలని సూచించింది. సంపద పంచాలంటే ముందుగా సంపద సృష్టి జరగాలని అభిప్రాయపడింది. ఉల్లిపాయలు లాంటి కమోడిటీల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రయోజనం ఇవ్వలేదని అభిప్రాయపడింది. వృద్ధికి ఊతమివ్వాలంటే ‘అసెంబుల్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ సూత్రాన్ని పాటించాలని, తద్వారా నూతన ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించింది.

పెట్టుబడుల కోసం విస్తృత అవకాశాలను కల్పిస్తామని తెలిపింది. మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా జిడిపి రేటును పెంచాలని భావిస్త్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రధానంగా వ్యవసాయ, ఉత్పాదక, సేవా రంగాల పరిధిని విస్తృతం చేస్తామని, ఫలితంగా జిడిపిలో వాటి వాటాను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపింది. ఆటోమొబైల్ వంటి ఉత్పాదక రంగాల్లో మందగమనానికి చెక్ పెట్టడంతో పాటుగా వాటి పునరుజ్జీవన దిశగా తమ చర్యలు ఉండబోతున్నాయని తెలిపింది. ఉత్పాదక, పారిశ్రామిక రంగాల్లో నెలకొన్న రెడ్ పూర్తి స్థాయి చర్యలు చేపడతామని ప్రభుత్వం వెల్లడించింది. పెట్టుబడులను ఆహ్వానించడానికి ఉన్న అడ్డంకులను నివారిస్తామని, భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని, భారత్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని తమ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తామని, ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేస్తామని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు.

రైతుల ఆదాయాలు రెట్టింపునకు చర్యలు

దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న రుణ సదుపాయం, పంటకు బీమా, సాగునీటి సదుపాయాలు లాంటి ప్రధాన సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, తద్వారా రైతుల ఆదాయలను రెట్టింపు చేయవచ్చని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలోని కార్మిక వనరులను ఇతర రంగాలకు మళ్లించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను అన్వేషించడంపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటుగా రైతలు నేరుగా ఆదాయాలు లభించే అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది.

వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, నీటి వినియోగం, మెరుగైన వ్యవసాయ విధానాల ద్వారా మెరుగైన దిగుబడులు సాధించడం, మార్కెట్ అవకాశాలు, సంస్థాగత రుణ సదుపాయం లభ్యత, వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల మధ్య అనుసంధానాన్ని పెంచడం లాంటి సమస్యలను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని సర్వే అ౧భిప్రాయ పడింది. అంతేకాకుండా వ్యవసాయ రుణ సదుపాయం విషయంలో ఒక సమగ్రమైన విధానం అవసరమనికూడా అభిప్రాయపడింది. చిన్న కమతాల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్టా మార్కెట్లనుంచి వాటిని దూరంగా ఉంచడం లాంటి చర్యల ద్వారా రైతులు ఆదాయాలను మెరుగుపర్చవచ్చని పేర్కొంది.

ఆర్థిక సర్వేలోని ప్రధాన అంశాలు

 మార్కెట్లు అందుబాటులోకి తేవడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని పెంచడం అనే ఇతివృత్తంతో 2019 20 ఆర్థిక సర్వేను రూపొందించారు.
5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి నైతిక విలువలతో కూడిన సంపద చాలా కీలకమని సర్వే అభిప్రాయపడింది.
ఏప్రిల్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 6.5 మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్షంలో కొంత సడలింపు ఉండాలని సూచించింది.
వృద్ధి రేటు తిరిగి పుంజుకునేందుకు సంస్కరణల అమలును వేగవంతం చేయాలని సర్వే ప్రభుత్వాన్ని కోరింది.
‘తాలినామిక్స్’ పేరుతో అర్థ శాస్త్రాన్ని సామాన్యుడికి అన్వయించే ప్రయత్నం చేశారు. ఒక ప్లేటు భోజనం కొనుగోలు శక్తి 29 శాతం మెరుగుపడిందని సర్వే పేర్కొంది.
2011 12లో 17.9 శాతంగా ఉన్న వ్యవస్థీకృత ఉపాధి కలన వాటా 2017 18 నాటికి 22.8 శాతానికి పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృతం కావడానికి ఇది అద్దం పడుతుందని పేర్కొంది.
2024 25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జిడిపి లక్ష్యాన్ని సాధించడానికి రాబోయే సంవత్సరాల్లో దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది.
2011 12 నుంచి 2017 18 మధ్య కాలంలో2.62 కోట్ల కొత్త ఉద్యోగాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సృష్టించడం జరిగింది.
2011 12తో పోలిస్తే 2017 18 నాటికి మహిళల రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్ 8 శాతం పెరిగింది.
మార్కెట్లు పౌరుల సంక్షేమాన్ని పెంచే కర్తవ్యాన్ని బాగా నెరవేరుస్తున్న సమయంలో ప్రభుత్వం మార్కెట్లలో మితిమీరి జోక్యం చేసుకోవడం వల్ల ఆర్థిక స్వేచ్ఛ దెబ్బతింటుందని సర్వే అభిప్రాయపడింది.
మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బ తీస్తాయని అభిప్రాయపడింది.
ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని సర్వే పేర్కొం ది. లబ్ధిదారులు తక్కువ ఖర్చు పెడతారు, తక్కువ పొ దుపు చేస్తారు.. తక్కువ పెట్టుబడి పెడతారని పేర్కొంది.
కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఆస్తుల రిజిస్ట్రేషన్, పన్నుల చెల్లింపు, కాంట్రాక్టుల అమలును సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు అంచనాలకంటే తగ్గే అవకాశం ఉంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టిఆదాయం పెరుగుతుంది. 2019 ఏప్రిల్ నవంబర్ మధ్య కాలంలో జిఎస్‌టి వసూళ్లు 4.1 శాతం పెరిగాయి.
ఈ సారి ఆర్థిక సర్వే కవర్ పేజిలను కొత్త వంద రూపాయల నోటు రంగు అయిన ఊదా రంగులో ముద్రించారు.

economic survey 2019 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News