Wednesday, May 15, 2024

ఒమిక్రాస్ సైలెంట్ కిల్లర్… ఇంకా బాధపడుతున్నా: సిజెఐ ఎన్‌వి రమణ

- Advertisement -
- Advertisement -

CJ NV Ramana About Omicron Variant

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ సోకి తగ్గినప్పటికీ దాని ప్రభావంతో తానింకా బాధపడుతున్నానని, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) జస్టిస్ ఎన్‌వి రమణ తెలిపారు. సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో భౌతిక విచారణ ప్రారంభించాలని ఓ సీనియర్ న్యాయవాది అభ్యర్థించడంపై సీజేఐ ఈ విధంగా స్పందించారు. “భౌతిక విచారణలు పాక్షికంగా మొదలవడం ఆనందంగా ఉంది. అయితే ఒమిక్రాన్ ఇప్పుడు వైరల్ జ్వరంగా మారింది. దీని లక్షణాలు స్వల్పం గానే ఉంటున్నాయి. ప్రజలు తొందరగా కోలుకుంటున్నారు. అందువల్ల సుప్రీం కోర్టులో పూర్తి స్థాయి భౌతిక విచారణను పునరుద్ధరించాలని కోరుతున్నా” అని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐను అభ్యర్థించారు. దీనికి సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ స్పందిస్తూ “నాకు ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. నాలుగు రోజుల్లోనే తగ్గింది. కానీ ఇంకా నాపై దాని ప్రభావం ఉంది. ఇది సైలెంట్ కిల్లర్ లాంటిది. నేను కరోనా తొలివేవ్‌లో వైరస్ బారిన పడి త్వరగానే కోలుకున్నా. కానీ ఇప్పుడు ఈ వేవ్‌లో నాకు ఒమిక్రాన్ సోకి 25 రోజులు గడుస్తున్నా ఇంకా వైరస్ అనంతర ప్రభావాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నా” అని అన్నారు. బుధవారం కూడా 15 వేలకు పైనే కొత్త కేసులు వెలుగు చూశాయని సీజేఐ తెలిపారు. అయితే వైరస్ పరిస్థితి సమీక్షించి పూర్తి స్థాయి భౌతిక విచారణలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

CJ NV Ramana About Omicron Variant

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News