Wednesday, May 8, 2024

క్లౌడ్ మైగ్రేషన్ అనేది ఒక పెద్ద అవకాశం: జయేష్ రంజన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలో అనేక సంవత్సరాల పాటు సేవా సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, ఇప్పుడు దానిలో మార్పు వచ్చిందని, మరిన్ని ఐటి కంపెనీలు ఉత్పత్తుల్లోకి ప్రవేశిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.  హైదరాబాద్‌లో మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో క్వాడ్రంట్ రిసోర్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మీడియాతో మాట్లాడారు. సేవా ఆధారిత ఐటీ పరిశ్రమ నుంచి తెలంగాణ ప్రొడక్టులను తయారుచేసి ఐటీ పరిశ్రమగా హైద్రాబాద్ రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు.

అధికారిక విద్యార్హతలు లేకుండానే ఐటి పరిశ్రమకు చెందిన నిపుణులు ఇప్పుడు ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’గా కాలేజీలకు ఫ్యాకల్టీగా వెళ్లవచ్చన్నారు. క్వాడ్రంట్ రిసోర్స్ విస్తరణలో ఉందని, దాని భారతీయ కార్యకలాపాలకు 800 మంది కొత్త సిబ్బందిని రాబోయే ఆరు నెలల్లో తీసుకోనుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన సాంకేతిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో మొత్తం ఐటి పరిశ్రమ కేంద్రీకృతమై ఉందన్నారు. ఐటీ పరిశ్రమ టైర్-2 నగరాలకు కూడా విస్తరించాలని జయేష్ రంజన్ సూచించారు. ఎస్ఎఫ్ టి క్వాడ్రంట్ రిసోర్స్ గ్లోబల్ డెలివరీ కంపెనీ వరంగల్‌కు వెళ్లడంతో పెద్ద ఐటీ కంపెనీలకు విశ్వాసం కల్పించారని కొనియాడారు. క్వాడ్రంట్ రిసోర్స్ అనేది ‘క్లౌడ్- డేటా’ కంపెనీ అని నాకు తెలుసునని, క్లౌడ్ మైగ్రేషన్ ఒక పెద్ద అవకాశమని, చాలా కంపెనీలు వలస వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News