Saturday, April 27, 2024

పుడమి పులకించి…. మొక్క చిగురించి

- Advertisement -
- Advertisement -

 వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసిన మంత్రులు, టిఆర్‌ఎస్ శ్రేణులు
 పలు ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు, యాగాలు,
 రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు
 ఒక గంటలో కోటి వృక్షార్చన
 రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమం

CM KCR 67th birthday celebrations on Feb 17 

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ వ్యవసాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 67వ పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారు. ఊరూ.. వాడా, పల్లె..పట్టణం అన్న తేడా లేకుండా పెద్దఎత్తున అన్నార్చన, కోటి వృక్షార్చన, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లోనూ అత్యంత భారీగా జరగనున్నాయి.
ప్రధానంగా ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ నేతృత్వంలో ఒక గంటలో కోటి వృక్షార్చన కార్యక్రం జరగనుంది. ఉదయం 10 నుంచి 11 గంటల లోపు కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసి అరుదైన చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని జలవిహార్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిఎం కెసిఆర్ జీవిత చరిత్రపై ప్రత్యేకంగా రూపొందించిన త్రీడి గ్రాఫిక్స్ డాక్యుమెంటరీ ప్రదర్శన చేస్తారు. అలాగే ప్రముఖ గాయకులు పాడిన ప్రత్యేక గీతాల టీజర్, ప్రోమోను కూడా ఆవిష్కరించనున్నారు. కాగా బల్కంపేట ఎల్లమ్మకు బంగారు కానుకగా రెండున్నర కిలోల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు చీరను ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ కూడా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా 300 మంది మహిళలకు చీరల పంపిణీ కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కోటి కుంకుమార్చన, హోమం, సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో గణపతి కల్యాణం, అన్నప్రసాద కార్యక్రమం, నాంపల్లిలోని హజరత్ దర్గాలో దట్టీ సమర్పణ, పేదలకు పండ్లు పంపిణీ కూడా జరగనుంది. అలాగే అమీర్‌పేట్‌లోని గురుగ్రంధ సాహెబ్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌వై, టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం ప్రత్యేకంగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ స్వయంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దోమల్‌గూడ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘అధి శ్రవణ మహా రుద్రయాగం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, పార్టీ నాయకులు హాజరవుతారన్నారు. ఈ యాగానికి వచ్చే దాదాపు 5 వేల మంది భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఉచితంగా కటింగ్, షేవింగ్
కెసిఆర్ బర్త్ డే సందర్భంగా బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్క్ వద్ద ఉచితంగా కటింగ్, షేవింగ్‌లను నిర్వహిస్తున్నటు కోడిచర్ల రమేష్ నాయి తెలిపారు. ఈ మేరకు అక్కడ కెసిఆర్, కెటిఆర్ ఫోటోలతో కూడా బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

పచ్చని పైరులో సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

CM KCR 67th birthday celebrations on Feb 17 

స్వరాష్ట్రం కోసం 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసిఆర్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామ ప్రజలు పచ్చని పొలాల్లో జరిపి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నాయకులు, గ్రామ ప్రజలు వినూత్న రీతిలో పచ్చని పొలాల్లో సీఎం కేసిఆర్ జన్మదినం పురస్కరించుకొని సల్లంగుండు బిడ్డా… అంటూ కేసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అక్షరాలతో బర్త్ డే విషేస్ చెప్పడం అందర్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసిఆర్ పాలనలో తన దైన ముద్ర వేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ జనరంజక పాలన ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. రైతుబిడ్డగా వ్యవసాయ రంగాన్ని అత్యాధునిక పద్ధతిలో అభివృద్ధి చేస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్నూర్ గ్రామ సర్పంచ్ రావుల శారద సాగర్, ఉపసర్పంచ్ గొల్లపెల్లి విష్ణుగౌడ్, జయ్యారం ఉపసర్పంచ్ గాజుల ఐలేష్, శంకరన్న, సత్యనారాయణ, వెంకటేష్, కందుల సత్తయ్య, కుమార్, చిన్నయ్య, మహేష్, శ్రీకాంత్, రామన్న, జిలేందర్, హరీష్, చందు, నరేష్, కిరణ్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

CM KCR 67th birthday celebrations on Feb 17 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News