Sunday, May 5, 2024

రుణమాఫీపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

Crop-loan

 

అర్హులైన రైతుల గుర్తింపు ప్రక్రియ మొదలు
చెక్కులా, బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీనా?
మార్గదర్శకాలపై అధికారుల తర్జనభర్జన

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయాలలోపు పంట రుణాల మాఫీ ప్రక్రియను ప్రారంభించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ప్రకటించిన దాని ప్రకారం రూ.25 వేలలోపు పంట రుణం ఉన్నవారికి ఏకకాలంలో మాఫీ చేయనున్నారు. ఇందుకోసం మార్చి నెలలోనే రూ.1210 కోట్ల బడ్జె ట్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం 5.83 లక్షల మంది రైతులు రూ.25 వేల లోపు పంట రుణం కలిగి ఉన్నారు. మొ త్తం వడ్డీతో కలిపి రూ. లక్ష వరకు ఉన్న రుణాలు రూ.24,738 కోట్లుగా ఉంది. అయితే మంగళవారం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ బుధవారమే రూ.1200 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన దాని ప్రకారం చెక్కుల రూపంలో రుణమాఫీ చేయా ల్సి ఉంది. అర్హులైన రైతులకు గ్రామాల్లోనే నేరుగా చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు.

అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం వంటివి ఉండటంతో ఎలా పంపిణీ చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రుణమాఫీ కోసం వ్యవసాయ శాఖ మార్చిలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం బ్యాంకులు, వ్యవసాయ, రెవిన్యూ అధికారులు కలిసి అర్హుల జాబితాను ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో లబ్ధిదారుల జాబితా కొలిక్కి రాలేదు. సిఎం ప్రకటనతో వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బిసి), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసి)తో సమావేశమయ్యారు. ప్రభుత్వం ముందుగా అనుకున్నదాని ప్రకారం రూ.25 వేలలోపు పంట రుణం ఉన్నవారిని గుర్తించాల్సి ఉంది. అయితే అలా కాకుండా మార్గదర్శకాల ప్రకారం 2014 ఏఫ్రిల్ ఒకటి నుంచి 2018 డిసెంబర్ 11వ తేదీ లోపు లక్ష రూపాయాలలోపు పంట రుణం ఉన్న రైతుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరి పేరు మీద ఎంత రుణం ఉంది అనే వివరాలు సేకరించనున్నారు.

ఒక కుటుంబానికి రూ.లక్ష వరకే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. కుటుంబ సభ్యుల అందరి పేర్ల మీద ఎంత బకాయి ఉంది? ఒక బ్యాంకు లోనే అప్పు ఉందా? వేర్వేరు బ్యాంకుల్లో ఉన్నాయా? బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలన్నీ ఏకకాలంలో సేకరించాలని బ్యాంకులకు జనార్ధాన్ రెడ్డి ఆదేశించారు. వారం రోజుల్లోపే ఈ జాబితా సిద్ధం కానుంది. ఇప్పటికే 45 బ్యాంకుల నుంచి వివరాలు సేకరించి 90 శాతం స్క్రీనింగ్ పూర్తి చేశారు. రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు వివరాలన్ని నమోదు చేసేందుకు ఒక ఐటి వ్యవస్థ లేదా పోర్టల్‌ను ఎన్‌ఐసి సహకారంతో వ్యవసాయ శాఖ తయారు చేస్తోంది.

CM KCR announces loan waiver upto Rs 2 Crore
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News