Saturday, May 11, 2024

రిజిస్ట్రేషన్లు షురూ

- Advertisement -
- Advertisement -

Registration dept

 

గ్రీన్‌జోన్లలో స్వల్పంగా కార్యాలయాల కార్యకలాపాలు ప్రారంభం, రెడ్ జోన్లలో అంతంత మాత్రమే
ప్రభుత్వానికి తొలిరోజు రూ.3.20 కోట్ల ఆదాయం
నేటి నుంచి వాహన రిజిస్ట్రేషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు లాక్‌డౌన్ సడలింపుతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలు బుధవారం ప్రారంభించింది. అయితే గ్రీన్‌జోన్‌లలో రిజిస్ట్రేషన్లు కొంతమేరకు జరిగినా రెడ్‌జోన్లలో ఇంకా కార్యకలాపాలు పుంజుకోలేదు. ఈ శాఖ బుధవారం మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ప్రతి రోజు సుమారుగా రూ.25 కోట్ల నుంచి రూ.30కోట్ల ఆదాయం సమకూర్చే ఈ శాఖ రూ.3.20 కోట్ల రూపాయలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఈ శాఖ గడిచిన ఆర్థిక సంవత్సరం 2019-2020 సంవత్సరాంతానికి రూ.7000 వేల కోట్ల రూపాయలు ఆర్జించింది. 2020/2021 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.10వేల కోట్ల అంచనాలతో ముందుకు వెళ్లినప్పటికీ కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కోల్పోయింది. బుధవారం నాడు 647 డాక్యుమెం ట్లు రిజిస్ట్రేషన్ కాగా ప్రభుత్వానికి రూ,3.20 కోట్ల రాబడి సమకూరింది.

అయితే సాయంత్రం వరకు జరిగిన రిజిస్ట్రేషన్లతో మరో రూ.30 లక్షలు రానుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 21.61 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. సాధారణ రోజుల్లో రోజుకు 4వేల నుంచి 5వేల వరకు రిజిస్ట్రేషన్లు జరగగా బుధవారం నాడు 647 మాత్రమే జరిగాయి. అయితే క్రమేన రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. 141 సబ్‌రిజిస్టార్ కార్యాలయాలు తమ విధులను ప్రారంభించినప్పటికీ కరోనా ప్రభావంతో రిజిస్టేషన్‌కు ప్రజలు రాకపోవడానికి అనేక కారణాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 100 శాతం ఉద్యోగులు హాజరయ్యారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనలు కఠినంగా అమలు చేశారు. ముందుగా స్లాట్స్ బుక్ చేసుకుని వచ్చేలా నిబంధనలు అమల్లో ఉండటంతో స్లాట్స్ బుకింగ్‌లపైనే ప్రజలు దృష్టి సారించారు. గురువారం నుంచి క్రమేణ రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయని అధికారులు చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భౌతిక దూరం, శానిటైజర్లను తప్పనిసరిగా వినియోగంలోకి తీసుకువచ్చారు.

నేటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్
గత 45 రోజులుగా నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ సేవలు బుధవారం నుంచి ప్రారంభం కావల్సి ఉండగా ముందుగా స్లాట్స్ బుకింగ్ జరగకపోవడంతో గురువారం నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. స్లాట్స్ బుకింగ్ లేకపవడంతో బుధవారం ఎలాంటి లావాదేవిలు జరగలేదు. స్లాట్ బుకింగ్‌ను రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ల్‌తో పాటు ఇతర సేవలను ప్రారంభించనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కె.పాపారావు చెప్పారు. కరోనా నేపథ్యంలో వాహనాదారులను మాత్రమే కార్యాలయాలకు అనుమతిస్తామని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. స్లాట్‌లో పేర్కొన్న సమయానికి రావాలని ఆలస్యం అయితే స్లాట్ రద్దు అవుతుందని ఆయన తెలిపారు. గత 45 రోజులుగా రవాణ శాఖ సుమారు రూ.350 కోట్లకు పైగా నష్టపోయిందని తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాలు ప్రారంభం కావడంతో లక్ష్యాలను సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.

Registration dept loses Rs 350 crore in 45 Days
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News