Saturday, April 27, 2024

జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నేతలు, అభిమానులు పెద్దఎత్తున ఆయన జన్మదిన వే డుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో సేవా కా ర్యక్రమాలను చేపట్టారు. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. వివిధ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పేద మహిళలకు చీరలను అందజేశారు. అలాగే రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేకం గా పూజా కార్యక్రమాలు, హోమాలు చేశారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కెసిఆర్ పుట్టిన రోజు వేడుకల సందడే కనిపించింది.

ఏ రోడ్డు సిఎం కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్‌లే దర్శనమిచ్చాయి. కెసిఆర్ పుట్టినరోజు వేడుకల సంబురాలు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. అలాగే బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖ పక్షాన అనేక దేశాల్లోనూ ఈ వేడుకలు అత్యంత భారీగా జరిగాయి.ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలలనుంచి లక్షలాదిగా కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా కెసిఆర్‌ను పుట్టిన రోజును శుభాకాంక్షలను కొందరు ప్రముఖలు ఫోన్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పగా, మరికొందరు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరి కొందరు నేరుగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువ
సిఎం కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లివిరిశా యి. ఆయన నిండు నూరేళ్ల చల్లగా ఉండాలంటూ ప్రము ఖులు తమ సందేశాలను పంపారు. వారిలో ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ కెసిఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా కెసిఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అలాగే మాజీ ప్రధాని హెడి దేవెగౌడ కూడా ట్విట్టర్ ద్వారా కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి కెసిఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువును ఇవ్వాలని ఆ దేవుడిని వేడుకుంటున్నట్లు వెల్లగించారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా కెసిఆర్‌కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, రాజ్ నాథ్‌సింగ్, రావుసాహెబ్ పాటిల్ దన్వే, శ్రీపాద్ ఎశో నాయక్‌లు కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సిఎం పినరయి విజయన్, తమిళనాడు సిఎం స్టాలిన్, ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి, అస్సాం సిఎం హిమంత విశ్వశర్మలు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, జనసేనా అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు,

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలాకర్, సబిత ఇంద్రారెడ్డి, మహమ్మూద్‌అలీ, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపిలు కేశవరావు, రవిచంద్ర, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్‌నేతతో పాటు హైదరాబాద్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ వోయెన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సినీ హీరో మహేశ్ బాబు, తదితర ప్రముఖులు సిఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ ప్రెసిడెంట్ అమిత్ అజిత్ జోగి, లోకమత్ మీడియా సంస్థ చైర్మన్ విజయ్ దర్దా తదితరులు సిఎంకు బర్త్‌డే విషెస్ చెప్పారు. సంపూర్ణ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా….
లండన్‌లో ఘనంగా కెసిఆర్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. బిఆర్‌ఎస్ నాయకులు సతీష్ రెడ్డి, దూసరి అశోక్ గౌడ్, రత్నాకర్, అబు జాఫర్, షణ్ముగ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిని వేడుకలో 150 మందికి పైగా హాజరయ్యారు. యుఎస్‌ఎలో హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో, బహ్రెయిన్ లో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో, జర్మనీలో అరవింద్ బాబు, రాజీవ్ ఆధ్వర్యంలో, ఖతర్‌లో శ్రీధర్ ఆధ్వర్యంలో, న్యూజిలాండ్‌లో జగన్, విజయ్ ఆధ్వర్యంలో, సౌతాఫ్రికాలో గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో, డెన్మార్క్ లో శ్యామ్ ఆకుల ఆధర్యంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
వివిధ రాష్ట్రాల్లో సంబురాలు
కెసిఆర్ జన్మదిన వేడుకలు ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఢిల్లీ బిఆర్‌ఎస్ జాతీయ కార్యాలయంలో పలువురు నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. ఒడిశా రాష్ట్రంలో బిఆర్‌ఎస్ శ్రేణులు అధినేత పుట్టిన రోజును ఘనంగా జరిపారు. నాందేడ్ లోనూ ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
కేక్ కట్ చేసిన మంత్రులు
కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలు నగరంలోని పివిమార్గ్‌లోని థ్రిల్‌సిటిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 69 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి సంబరాలను నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడి,్డ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కళాకారులు నిర్వహించిన ఆట పాట పలువిరిని ఆకట్టుకున్నాయి. జబర్దస్త్ కళాకారులు రాజమౌళి అప్పారావు కార్తీక్ నవీన్ తన్మయి బృందం చేసిన కామెడీ కడుపుబ్బ నవ్వించింది.

అదేవిధంగా కెసిఆర్ జీవిత చరిత్ర, రాజకీయ నేపథ్యంతో రూపొందించిన డాక్యుమెంటరిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు, ఎంఎల్‌సిలు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేషం, సురభి వాణిదేవి, శాసనసభ్యులు దానం నాగేందర్, ముఠా గోపాల్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుమార్, కోలేటి దామోదర్, సోమా భరత్ కుమార్ గుప్తా, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గ్యాదరి బాలమల్లు, రాంచందర్ నాయక్ నగర మేయర్ విజయలక్ష్మీతదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో…
కెసిఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ గోపినాథ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కట్టెల శ్రీనివాస్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
మెగా రక్తదాన శిబిరం
మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలో 700 మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో స్వయంగా మంత్రి పాల్గొన్నారు. అంతకు ముందు సూర్యాపేటలో 70 కేజీల కేక్ ను కట్ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఐసియూ యూనిట్ తో కూడిన అంబులెన్స్‌ను సూర్యాపేట ఏరియా దవాఖానాకు ఈ సందర్భంగా మంత్రి అందించారు. అలాగే దివ్యాంగులకు త్రివీలర్స్ ను అందించారు. అనంతరం చారిత్రాత్మక పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలు నాటారు.
ప్రగతి భవన్ సిబ్బంది సంబురాలు
ప్రగతిభవన్‌లో కెసిఆర్ పుట్టిన రోజు సంబురాలను కార్యాలయ సిబ్బంది ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సిఎంకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలపారు. మిఠాయిలు పంచుకున్నారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో కలకాలం వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ సంబురాల్లో సిఎం పిఎస్ వెంకట నారాయణ, సిపిఆర్‌ఒ వనం జ్వాలా నరసింహారావు, పిఆర్‌ఒ రమేష్ హజారీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జనజాగృతి ఆధ్వర్యంలో…
కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను భారత జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవితతో పాటు మనవడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడుకుతో కలిసి భారీ కేక్ కట్ చేసి, గులాబీ బెలూన్స్ ను గాల్లోకి కవిత ఎగరవేశారు. ఈ సందర్భంగా సందర్భంగా స్టేడియంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన జట్లకు కవిత బహుమతులు అందించారు.
బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో
కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పార్శిగుట్టలోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా, సాంప్రదాయరీతిలో ఘనంగా చండీయాగం, రుద్రహోమం, దక్షిణమూర్తి హోమం, సుదర్శనహోమాలను నిర్వహించింది. ఈ పూజాలు, హోమాల ద్వారా కెసిఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆయురారోగ్యాలను కల్పించాలని కోరుకునన్నట్లు బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సంకేపల్లి సుధాకర్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో మరోసారి భారీ మెజార్టీతో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోవడంతో పాటు కెసిఆర్ ప్రధాని కావాలన్న కోరికను కూడా నెరవేర్చాలని కోరుకున్నామన్నారు.
రంగనాయక్ సాగర్‌పై…
సిఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్‌పై వినూత్న రితీలో పారాగ్లయిడర్లపై హ్యాపీ బర్త్‌డే సిఎం….అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అరవింద్ అలిశెట్టి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
నా ఆరాధ్య దైవం…తాతయ్య
నా బెస్ట్ ఫ్రెండ్, స్ఫూర్తిదాయకమైన ఆరాధ్యదైవం అయిన కెసిఆర్ తాత పుట్టిన రోజు అంటే తనకు అత్యంత ఇష్టమైన రోజు అని కెటిఆర్ కుమారుడు హిమాన్షు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మనవడిగా పుట్టడం ఎన్నో తన అధృష్టమన్నారు. నీతి, సామాజిక నైతికత నేర్పినందుకు తాతయ్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News