Wednesday, May 1, 2024

అట్టడుగు వర్గాల కోసం సిఎం కెసిఆర్ నిరంతర కృషి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎతైన అంబేడ్కర్ విగ్రహాం సందర్శించాలని ఆడిగిన వెంటనే భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ హైదరాబాద్‌కు రావడం హర్షనీయమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు ఆజాద్‌కు ఎప్పుడు ఉంటుందని ముందుకు వెళ్ళండి మేము మీ వెంట ఉంటామని పేర్కొంది. ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర కల సిద్దించిందని దళిత వర్గాలు ,అట్టడుగు ప్రజల కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని తెలిపింది. అంబేద్కర్ విగ్రహం పార్లమెంట్ లో పెట్టాలని, అదే విధంగా పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరితే మోడీ నుండి స్పందన లేదన్నారు.

అనంతరం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు,బిఆర్‌ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ తాను ఢిల్లీ లో నిరసన తెలిపినప్పుడు కవిత దీదీ బీఆర్‌ఎస్ ఎంపిలను పంపించి మద్దతు ప్రకటించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని ప్రశంసించారు. నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు చాలా సంతోషంగా ఉందని ఈసందర్భంగా నూతన పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చినందుకు సంతోషంగా ఉందని తనపై ప్రేమ చూపినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మణిపూర్ ఘటన దేశంలో అత్యంత దారుణమైన సంఘటన దేశంలో ఏ మహిళకు కూడా జరగకూడదని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి పార్లమెంట్ లో అంబేడ్కర్ విగ్రహం స్థాపించాలన్నారు.

స్వాతంత్య్రం రాకముందు అంబేడ్కర్‌తో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు కూడా వాళ్లకే ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా స్వాగతిస్తున్నామని దేశ వ్యాప్తంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు, చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, అంజనేయగౌడ్, రాజీవ్‌సాగర్, బాబా ఫసియుద్దీన్, కె. కిషోర్‌గౌడ్, ముఠా జైసింహం తదితరులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News