Monday, May 6, 2024

మళ్లీ వరి ‘వార్’

- Advertisement -
- Advertisement -

CM KCR Held an emergency meeting with ministers

మరోసారి ఢిల్లీతో ఢీ.. 21న మంత్రులతో కలిసి వెళ్లనున్న సిఎం

సోమవారం ఉదయం 11.30
గం.కు తెలంగాణ భవన్‌లో
టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష
సమావేశం ఉభయ సభల
టిఆర్‌ఎస్ సభ్యులు, పార్టీ రాష్ట్ర
కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్లు,
జిల్లా అధ్యక్షులు, జెడ్‌పి చైర్మన్లు,
డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు
సమితుల జిల్లా అధ్యక్షులు హాజరు
కావాలని సిఎం ఆదేశం పంజాబ్
నుంచి కొనుగోలు చేస్తున్న పద్ధతిలో
రాష్ట్రం నుంచి కూడా వంద శాతం
వరిధాన్య సేకరణ జరపాలనే
డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమం,
ఉధృత పోరాటానికి సన్నాహాలు
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో శనివారం
నాడు మంత్రులతో అత్యవసర
సమావేశం నిర్వహించిన సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై మోడీ సర్కార్‌తో ఢీ కొట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన మంత్రులు, పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రా ష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చి తంగా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయనున్నారు. ఈ డిమాండ్‌కు కేం ద్రం తలవంచని పక్షంలో అవసరమైతే గల్లీ నుంచి ఢిల్లీకి సెగ తగిలే విధంగా రాష్ట్రంలో ఉ ధృతంగా ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ కా ర్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభలోనూ, రాజ్యసభలనూ టిఆర్‌ఎస్ ఎంపిలు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. అంశాల పై చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్ర వల్లిలోని తన ఫామ్ హౌస్ లో శనివారం అత్యవ సర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావే శానికి మంత్రులను, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ఆహ్వానించారు.

వివిధ అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చిం చారు. వీటిపై టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పా ర్టీ నేతల అభిప్రాయాలు, సూచనలను స్వీక రించేందుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశానికి శా సనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొ రేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, జెడ్‌పి చైర్మ న్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిస రిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేం ద్రప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాల ని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొ న్నారు.

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేక రిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూ డా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సిఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేకరించా లని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమా లు కొనసాగించనున్నట్లు సిఎం కెసిఆర్ వివ రించారు. రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈదఫా ఉధృతమైన పోరాటాలకు టిఆర్‌ఎస్ సిద్ధమవుతున్నందున సమావేశానికి ఆహ్వానితులంత తప్పనిసరిగా హాజరుకావాలని సిఎం స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News