Wednesday, May 1, 2024

డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Key Meeting With Officials On Drugs

హైదరాబాద్: డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ నేతృత్వంలో పోలీస్, ఆబ్కారీ సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సులో మంత్రులు, పోలీసు, ఆబ్కారీశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలన్నారు. సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే డ్రగ్స్ కట్టడి సాధ్యమన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం సృజనాత్మక కార్యక్రమాలు తేవాలని పేర్కొన్నారు. డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడన్నారు. డ్రగ్స్ వాడేది ఎవరైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏ పార్టీకి చెందినవారైనా  వదిలేది లేదని తేల్చిచెప్పారు. నేరస్తులను కాపేడేందుకు ప్రజాప్రతినిదుల సిఫార్సులు తిరస్కరించాలన్నారు. వెయ్యి మంది సుశిక్షితులైన సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని కెసిఆర్ చెప్పారు.  డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి తరిమేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News