Saturday, April 27, 2024

రాజ్యాంగ పదవుల్లో ఉండి ఫాసిస్టు దాడులా?

- Advertisement -
- Advertisement -

కమలనాథులపై సిఎం
కెసిఆర్ ఫైర్

సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు ప్రజా
సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రాలపై పెత్తనం
కుంటుపడుతున్న దేశాభివృద్ధి.. పెరుగుతున్న
ద్రవ్యోల్భణం వైఫల్యాలను
కప్పిపుచ్చుకోవడానికే విద్వేషాలు రాష్ట్రంపై
అప్పుల భారం పెరిగిందంటూ తప్పుడు
ప్రచారాలు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను
హరిస్తున్న కేంద్రం స్వాతంత్య్ర దినోత్సవ
ప్రసంగంలో ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు

మన తెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సాక్షిగా మరోసారి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మోడీని టార్గెట్‌గా చేసుకుని పలు విమర్శనాస్త్రాలను సంధించారు. భారత దేశం రాష్ట్రాల యూనియన్ ( ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్) అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే కేంద్రం అపహాస్యం పాలు చేసిందని మండిపడ్డారు. సమాఖ్య విలువలకు కేంద్రం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. కూ చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కు ట్రలకు కేంద్రం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వే డుకలను పురస్కరించుకుని సోమవారం గోల్కొండ కోటపై సిఎం కెసిఆర్ జా తీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాఖ్య స్ఫూర్తి అంటూ వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారని, సమాఖ్య స్వరూపాన్ని ఏర్పా టు చేశారన్నారు. కానీ ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమా ఖ్య విలువలకు పూర్తిగా తూట్లు పొడుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం సాగించాలన్న ఏకైక లక్షంతో పాలన సాగిస్తోందన్నారు. ఢిల్లీ పాలకులకు పరిపాలన చేతకాకపోవడం వల్లే దేశ ఆర్థికాభివృద్ధి నానాటికి కుంటుపడుతోందని ఆరోపించారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సిఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయిందన్నారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతున్నదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని భగ్గుమన్నారు.

రాష్ట్రంపై తప్పుడు ప్రచారం

తెలంగాణ అన్ని రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే….. కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019..20-20 సంవత్సరానికి రాష్ట్ర అప్పుల మొత్తం 2 లక్షల 25 వేల 450 కోట్ల రూపాయలన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014లోనే సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75 వేల 577 కోట్ల రూపాయలన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1 లక్షా 49 వేల 873 కోట్ల రూపాయలేనని ఆయన వెల్లడించారు. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే ప్రభుత్వం వినియోగించిందన్నారు. జిఎస్‌డిపిలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే .. దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయని కెసిఆర్ వ్యాఖ్యానించారు. జిఎస్‌డిపిలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జిడిపిలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతమన్నారు. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు.

ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తున్న కేంద్రం

్లరాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను కేంద్రం దెబ్బతీస్తూ నిరంకుశంగా…. రకరకాల ఆంక్షలు విధిస్తున్నదని కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిలో తీసుకొనే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నదన్నారు. పైగా కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలన్నారు. కానీ కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నదన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-..2023లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి గండి కొడుతున్నదన్నారు. అంటే రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నదని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎడాపెడా పన్నుల బాధుడు

పాలన చేతకానీ మోడీ ప్రభుత్వానికి….. ప్రజలపై మోయలేని విధంగా పన్నుల భారాన్ని మోపి వారి నడ్డివిరుస్తోందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని అన్నారు. కానీ కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమని కెసిఆర్ పేర్కొన్నారు.

దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వెకిలి…మకిలి చేష్టలు

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోందని కెసిఆర్ అన్నారు. అలాంటి భారతదేశ ప్రతిష్టను ప్రస్తుతం దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలోనూ మత చిచ్చురేపి రేపాలనీ, శాంతిని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలనీ, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలనీ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

స్వాతంత్య్ర పోరాట చరిత్ర నేటి తరానికి తెలియాలి

భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను, ఆదర్శాలను, విలువలను నేటితరానికి సవివరంగా తెలియజేయాలనే సత్ సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రోజుల పాటు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను సమున్నతంగా నిర్వహిస్తున్నదని కెసిఆర్ అన్నారు. ఈ నెల 8వ తేదీన ఉత్సవాల ఉద్ఘాటనను ఉత్తేజపూరితంగా జరుపుకున్నామన్నారు. వీటిని ఈనెల 22వ తేదీవరకు దేశభక్తిని చాటుకునే విధంగా అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకుంటున్నామన్నారు.

యావత్ దేశం నివ్వెరపోతోంది

ప్రతి రంగంలోనూ యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, ప్రగతి పథంలో తెలంగాణ రాష్ట్రం పరుగులు పెడుతున్నదని కెసిఆర్ అన్నారు. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే రాష్ట్రం అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటున్నదన్నారు. జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకోవడమే కాకుండా….. నేడు దేశానికే దిక్సూచిగా మారి రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగొందుతోందన్నారు.

బలీయమైన ఆర్ధిక శక్తిగా…

దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ నేడు బలీయమైన ఆర్థికశక్తిగా అవతరించిందని కెసిఆర్ అన్నారు. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014..20-15లో రాష్ట్ర ఆదాయం రూ. 62 వేల కోట్ల ఉండగా, గత ఆర్ధిక సంవత్సరం నాటికి 1 లక్షా 84 వేల కోట్ల రూపాయలకు పెంచుకోగలిగామన్నారు. అంటే ఏడేండ్లలోనే రాష్ట్ర రాబడి మూడు రెట్లు పెరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటలపాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చిందన్నారు. ఉమ్మడి పాలనలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెడుతూ…. అన్నపూర్ణగా అవతరించిందన్నారు. ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గొర్రెల పెంపకంలో దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం ఉందన్నారు.

అగ్రగామిగా ఐటి పారిశ్రామిక రంగం …

ఐటి రంగంలో రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోందని కెసిఆర్ వెల్లడించారు. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐటి పరిశ్రమలు ప్రస్తుతం హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయన్నారు. ఇందులోమన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర ఐటి రంగం1 లక్ష 55 వేల ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించిందన్నారు. అలాగే 12.01 శాతం ఉత్పత్తిరంగ వృద్ధి రేటుతో పారిశ్రామిక ప్రగతిలోనూ రాష్ట్రం అగ్రగామిగా దూసుకపోతున్నదన్నారు. సుస్థిర ప్రభుత్వం, పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలతోనే పరిశ్రమలకు రాష్ట్రం స్వర్గధామంగా మారిందన్నారు.

స్వంత పన్నుల ఆదాయంలోనూ తెలంగాణే టాప్

గత ఏడేండ్లుగా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం (ఎస్‌ఒటిఆర్) లో 11.5 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించిందన్నారు. ఇది మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ పెరుగుదల ఏదే ఆషామాషీగానో, అయాచితంగానో రాలేదన్నాపరు. రాష్ట్ర ప్రభుత్వం పాటించిన పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ, అడుగడుగునా ప్రదర్శించిన పారదర్శకత, అవినీతిరహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014..20-15లో జిఎస్‌డిపి 5 లక్షల 5 వేల 849 కోట్లు కాగా అది 2021..20-22 నాటికి 11 లక్షల 48 వేల 115 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. అంటే గత ఏడేండ్లలో రాష్ట్ర జిఎస్‌డిపి 127 శాతం పెరిగిందన్నారు. అదే సమయంలో దేశ జిడిపి 90 శాతం మాత్రమే పెరిగిందన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు భారతదేశ వృద్ధిరేటుకంటే 27 శాతం అధికంగా ఉందన్నారు. రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

దళిత జీవితాల్లో మార్పుకోసమే దళితబంధు

75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదన్నారు. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు ప్రసరించిందన్నారు. కానీ ఆ తర్వాత గొప్ప ప్రయత్నమేదీ జరగలేదన్నారు. దేశంలో దళితవర్గం పట్ల సామాజిక వివక్ష, అణచివేత నేటికీ కొనసాగుతున్నదన్నారు. ఫలితంగా దళితవాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన “దళితబంధు” పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు.

నేతన్న బీమా సదుపాయం

జాతీయ చేనేత దినోత్సవం నాటి నుంచి నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని కెసిఆర్ తెలిపారు. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి లబ్దిదారుల ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.

రైతులకు ధీమా…రైతు బీమా

75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో రూ. 57,880 కోట్ల తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ అన్నారు. ఐక్యరాజ్య సమితి రైతుబంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతులకు ఎనలేని ధీమా ప్రభుత్వం అందిస్తున్న రైతుబీమా అని పేర్కొన్నారు.

బలహీనవర్గాలకు ఉన్నత విద్య

బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు అమితమైన ప్రాధాన్యతనిచ్చిందని కెసిఆర్ తెలిపారు. దేశంలో అత్యధికంగా గురుకులాలు కలిగిన ఒకే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన పేదవర్గాల పిల్లలు ఈ గురుకులాల్లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాటవాలను చాటుకుంటున్నారన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు మన ఊరు – మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా రూ. 7,289 కోట్ల వ్యయంతో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నదన్నారు. రాష్ట్రంలో కొత్తగా మహిళా,అటవీ విశ్వ విద్యాలయాలను నెలకొల్పబోతున్నామన్నారు.

మారిన గ్రామాల రూపురేఖలు

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మనం గొప్ప పురోగతిని సాధించామని కెసిఆర్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రతతో, పచ్చదనంతో, సకల మౌలిక వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. నేడు మన పల్లెల్లో తోవకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతాలు పలుకుతున్నాయన్నారు. సుందరమైన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు మన రాష్ట్రంనుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమన్నారు.

ప్రతి జిల్లాకు ఒక వైద్య, నర్సింగ్ కళాశాల

వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందన్నారు. దేశంలో అత్యుత్తమమైన వైద్య సేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు. ప్రజలకు అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. కిడ్నీ రోగుల కోసం ప్రత్యేకంగా డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం నెలకొల్పిందన్నారు.
హైదరాబాద్ నగరవాసులతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా నగరం నలుచెరగులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడున్న 1500 పడకలకు అదనంగా మరో 2000 పడకలు ఏర్పాటవుతున్నాయి. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో రెండు వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతున్నాయన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తున్నదన్నారు.

పోలీసు శాఖలో అత్యాధునిక సాంకేతిక విప్లవం

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు కావడం కోసం ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని కెసిఆర్ అన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్ర ఖ్యాతి మరింతగా ఇనుమడించిందన్నారు. పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతిక విప్లవానికి ఈ సెంటర్ నాంది పలికిందన్నారు.ప్రకృతి ఉత్పాతాలు, ఇతర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సెంటర్ సమాచార సమన్వయానికి, సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు అద్భుతంగా ఉపయోగ పడుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్ వ్యవస్థను కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.

క్రీడాకారులకు అభినందనలు

ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో 61 పతకాలను సాధించిన భారత క్రీడాకారులకు కెసిఆర్ మరోసారి అభినందనలను, శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్రానికి 6 పతకాలను సాధించి పెట్టిన తెలంగాణ క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News