Sunday, April 28, 2024

తెలంగాణకు మిడుతల దండు ప్రమాదం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Meeting with Education Officials over 10th Exams

హైదరాబాద్: తెలంగాణకు మిడుతల దండు ప్రమాదం పొంచి ఉందని.. మిడుతల దండును ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను అదేశించారు. ‘మిడుతల దండు తెలంగాణకు సమీపంలోకి వచ్చింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల 25 నుంచి జూలై 5వ తేదీ వరకు మిడుతల దండు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని మిడుతల దండు నుంచి కాపాడటానికి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలి. మిడుతల దండు దక్షిణంపైపు వస్తే తెలంగాణకు ముప్పు. మిడుతల దండు దాడి చేస్తే చాలా నష్టం. లేత పంటను పీల్చి పడేస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులోని ఎనిమిది జిల్లాలూ అప్రమత్తంగా ఉండాలి. అదిలాబాద్‌కు సిఎస్ బృందాన్ని పంపుతున్నాం’ అని సిఎం కెసిఆర్ తెలిపారు.

cm kcr review meeting on locust swarm

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News