Friday, April 26, 2024

పాలమూరులో అప్పుడు కరువు.. ఇప్పుడు పంటలు

- Advertisement -
- Advertisement -

వనపర్తిః జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎలు అల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎంపిలు రాములు, మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇష్టపడి పని చేసి అభివృద్ధి చేసుకుంటున్నాం. పాలమూరు జిల్లాలో కరువు మాయమై పంటలు పండుతున్నాయి. ఉత్తమమైన ఉద్యోగుల సర్వీస్ రూల్స్ తెలంగాణలోనే ఉన్నాయి. మనం సాధించింది చాలా తక్కువ.. దీన్ని చూసే చాలా మంది ఈర్ష పడుతున్నారు.ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకునే రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే తలసరి ఆదాయం ఎక్కువ. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తైతే అభివృద్ధి ఇంకా జోరుగా సాగుతుంది. వైద్య రంగంలోనూ తెలంగాణ దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి నిధి నుంచి వనపర్తి పట్టణానికి రూ.కోటి ప్రకటిస్తున్నా. నగర పంచాయతీలకు రూ.50లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.20లక్షలు మంజూరు చేస్తున్నా” అని చెప్పారు.

CM KCR Speech at Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News