Friday, April 26, 2024

మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR to addressed public meeting at LB stadium

 

హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా ఉందో ప్రజలు చర్చ చేయాలి. భవిష్యత్ కోసం ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల మీద చర్చ జరగాలి. ప్రభుత్వ కార్యక్రమాల మీద చర్చ జరిగినప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మంచిచెడులకు సాక్ష్యంగా ఉన్న నగరం హైదరాబాద్. వాదాలు, అపవాదాలు చిత్రవిచిత్రమైన వాదనలెన్నో చూశాం. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. మీకు తెలివితేటలు లేవు పాలించలేరు అన్నారు. మీకు నీళ్లురావు, కరెంట్ ఉండదని కొంతమంది అన్నారు. హైదరాబాద్ ఖాళీ అవుతుందని పుణ్యాత్ములు శాపాలు పెట్టారు. దేశమే ఆశ్చర్యపోయేలా బహిరంగ సభలను జరిపినం.

ఉద్యమం గమ్యాన్ని చేరింది ఇప్పుడు కావాల్సింది రాజకీయ పరిణతి. మనం సంయమనం పాటించాలి, రాజకీయ పరిణితి చూపించాలి. ఎవరూ ఊహించలేని పరిణతిని చూపించాం. ఈ గడ్డమీద ఉన్న ప్రతీబిడ్డ మా బిడ్డే అని చెప్పిన. ఇక్కడి ప్రజల భద్రతే లక్ష్యంగా పని చేశాం. ఎవరూ ఊహించని విజయాలు సాధించాం. కరెంట్ ఉండదని చెప్పిన వాళ్ల అంచనాలు తలకిందులు చేశాం. కృషి, పట్టుదల, మొండితనంతో వెలుగుజిలుగుల తెలంగాణ కావాలనే తపనతో పని చేశాం. ఇవాళ హైదరాబాద్ లో జనరేటర్లు, ఇన్వెర్టర్లు, కన్వర్టర్లు లేవు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్నం. వట్టి మాటలతోనే కరెంట్ సమస్య పరిష్కారమైందా. టిఆర్ఎస్ పంథాలు ఒక యూనిక్ స్కీమ్స్. మిషన్ భగీరథ అద్భుతం, అనన్య సామాన్యం. హైదరాబాద్ లో 24గంటలు మంచినీళ్లు ఇవ్వాలన్నాదే మా లక్ష్యం. మిషన్ భగీరథ వచ్చినంక మంచినీటి బాధలు పోయినయి. 20 వేల లీటర్ల వరకు నగర్ ప్రజలకు ఉచితంగా ఇస్తాం.

ఇది ఎన్నికల తాయిలం కాదు శాశ్వతంగా ణగర ప్రజలకు కానుక. అపార్టమెంట్లలో ఉండే వారికి కూడా 20 వేల లీటర్లు ఉచితం. భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా ప్రతీ గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ ఉన్నాది. కంటి వెలుగు అద్భతమైన పథకం. దేశంలో ఎప్పుడు ఇలాంటి పథకాన్ని ఆచరణలోకి తీసుకురాలేదని, కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్టు దేశలో ఎక్కడైనా ఉన్నాయా అని అడిగారు. రైతుబంధు ద్వారా ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే అని తెలిపారు. గుంట భూమి ఉన్నవారికి కూడా రైతు బీమా కల్సిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. అన్ని కుల వృత్తుల వారిని ఆదుకున్నాం. గీత కార్మికుల కోసం హైదరాబాద్ లో కల్లు దుకాణాలు తెరిపించాం. మత్స్య కార్మికులను ఆదుకున్నాం, ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం. గొల్ల కురుమలకు కూడా గొర్రెలను పంపిణీ చేస్తాం. దోబీఘాట్లు, లాండ్రీ షాపులకు కరెంట్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది.

పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశాం. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ ఒక్కరి గురించి ఆలోచించి పథకాలు అమలు చేస్తోంది. కరోనాతో రాష్ట్రానికి రూ.55 వేల కోట్ల నష్టం వచ్చినప్పటికి సంక్షేమ పథకాలు కొనసాగించాం. కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నాం. హైదరాబాద్ నగరం అశాస్తీయంగా పెరిగింది. గత పాలకులు అందుకు బాధ్యత వహించాలి. లక్షలాది మంది బతకడానికి రావడంతో బస్తీలు, కాలనీలు పెరిగిపోయాయి. అభివృద్ధి కోసం రూ.60 నుంచి రూ.70 వేల కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్ వరద ముంపునకు గురైంది. వరద నుంచి హైదరాబాద్ ను కపాడుకోవాలి. ప్రతి బడ్జెట్ లో నగరానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తెం. జిహెచ్ఎంసికి ప్రభుత్వం అండగా ఉంటుంది. పరిశ్రమలన్నీ సిటీ మధ్యలోకి వచ్చాయి. వాటిని బయటకు పంపించి కాలుష్యాన్ని తొలగిస్తాం.

ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. కలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ ఇస్తాం. ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దు. గత ఆరేళ్లలో శాంతి భద్రతల పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. నివాస యోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతాం. నగరంలో 5 లక్షల సిసి కెమెరాలను ఏర్పాటు చేశాం. దేశంలో వరదలు రాని నగరమంటూ లేదు. ముంబైలో 10 రోజులు, చెన్నైలో 25 రోజులపాటు, బెంగళూరు. కోల్ కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ లో వరదలు వచ్చాయి. హైదరాబాద్ లో వరదలు వస్తే నేతలు మోకాళ్లలోతు నీళ్లలో ప్రజలకు అండగా నిలబడ్డారు. వరద బాధితులను ఆదుకోమని ప్రజలు అడగముందే ఇంటికి రూ.10 వేలు సాయిం అందించాం. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేస్తుంటే కిరికిరి పెట్టారు.

మీ సేవలో అప్లై చేసిన వారికి కూడా రూ.10 వేలు అందజేశాం. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశాం. డిసెంబర్ 7వ తేదీ తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తాం. హైదరాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నా. మరో రూ.300 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడదు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం అందిస్తాం. ప్రధానిని రూ. 1300 కోట్లు సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతదేశంలో లేమా. బెంగళూరు, అహ్మదాబాద్ కు వరద సాయం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరికి కర్రుకాల్చి వాతపెట్టాలో హైదరాబాద్ ప్రజలకు తెలుసు. వరదలా వస్తున్న నేతలను చూస్తే మున్సిపల్ ఎన్నికలేనా అనిపిస్తోంది. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News