Monday, April 29, 2024

అక్కడా… ఇక్కడా కాదు… అంతటా కెసిఆరే

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి చేశాం..ఆశీర్వదించండి
వలసల వనపర్తిని..వరి పంటల వనపర్తిగా
మార్చిన మొనగాడు నిరంజన్‌రెడ్డి
ఐక్యమత్యంతో మరోసారి గెలిపించాలి
వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్
అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: గత పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు ఆలోచించి ని ర్ణ యం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మభ్య పెట్టేందుకు వస్తున్న పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. 24 ఏళ్ల క్రి తం పిరికెడు మందితో ప్రారంభమైన ఉద్యమం ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. దమ్ముంటే కొడంగల్‌కు రా అని సవాల్ చేస్తున్నారని 119 ని యోజకవర్గాల్లో 119 మంది కెసిఆర్‌లు ఉన్నారని, తాను రా వాల్సిన అవసరం లేదన్నారు. ఒకప్పుడు వలసలకు, అంబలి కేంద్రాలకు నిలయమైన పాలమూరు జిల్లా నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు.

సాయి చందు లాంటి కళాకారులు, ఎంతో మంది ఉద్యమకారులు, జనాన్ని చైతన్యం చేసి, తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తల పెడి తే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో ఇ ప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించా రు. తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరనేది ప్రజలు కాం గ్రెస్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం పూర్తి చేయడం ద్వారా వనపర్తిలో లక్ష ఎకరాలకు నీ ళ్లు వస్తున్నాయన్నారు. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తి గా చేసిన మొనగాడు నిరంజన్ రెడ్డి అని, ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికి చెందిందన్నారు. చిన్న మందడి, పెద్ద మందడి లాంటి అనేక తండాలకు ఎత్తైన ప్రాంతాలకు సైతం సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. పాలమూ రు రంగారెడ్డి నుంచి ఏదుల రిజర్వాయర్ ద్వారా నీరు వచ్చే విధంగా నిరంజన్‌రెడ్డి కృషి చేశారని అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టనీయకుండా అడ్డుకట్ట వేసే ప్ర యత్నాలు చేశారని విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి ఎ త్తిపోతల ద్వారా ఒక్క పంపు నీరు ఎత్తిపోస్తేనే కల్వకుర్తి కాలు వ మొత్తానికి నీళ్లు వస్తున్నాయని, 9 పంపుల నీళ్లు వస్తే పాలమూరు జిల్లాలో కరువు శాశ్వతంగా తొలగిపోతుందన్నారు. అడ్డం పొడువు మాట్లాడే నాయకులు ఒకడున్నాడని, గత 70 ఏళ్ల పాలనలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పాలమూరు జిల్లా లో 5 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చేందుకు కృషి చేసింది మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కాదా అని అన్నారు. వనపర్తి జిల్లాకు పశు వైద్య కళాశాల, దక్షిణ భాగం వైపు బైపాస్, ఉత్తర భాగం వైపు బై పాస్ మంజూరు చేయాలని నిరంజన్ రెడ్డి కోరాడని అన్నారు.

దక్షిణ భాగం వైపు బైపాస్ మంజూరు చేయడం జరిగిందని, ఉత్తర భాగం బైపాస్ మంజూరు చేస్తానని హామి ఇచ్చారు. రైతాంగాన్ని, ముస్లింలను, దళిత వర్గాలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాయని అన్నారు. ఒక్కసారి ఆ వర్గాలు ఆలోచించాలని కోరారు. వలసలు, ఆకలి చా వులు, ఆత్మహత్యలకు నిలయంగా ఉండే తెలంగాణను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒళ్లు దగ్గర పె ట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి పేదల సం క్షేమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

ఆసరా పెన్షన్ రూ.200 నుంచి వెయ్యికి పెంచడం జరిగిందని, ఆ తర్వాత 2వేలు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుగుణంగా ప్రస్తుతం 3 వేల పెన్షన్ చేస్తామని చెప్పామని, ఏడాదికి 500 చొప్పున 5వేల వరకు పెంచుతామని అన్నారు. ప్రపంచంలోనే రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను పుట్టించిన నాయకుడు కెసిఆర్ అని అన్నారు. దేశంతో 24 గంటలు కరెంట్ నిరంతరాయంగా అందిస్తున్నామని, సం వత్సరానికి లక్ష కోట్లు ప్రభుత్వం భరిస్తుందన్నారు. రాయేదో, రత్నం ఏదో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు.

రైతన్నకి మేలు జరిగే విధంగా ప్రవేశపెట్టిన ధరణి వంటి వ్యవస్థను తొలగిస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెరిగిన భూముల ధరలకు ధరణి వంటివి లేకుంటే ఎన్ని అరాచకాలు జరిగేవో ప్రజలు ఆలోచించాలన్నారు. నియోజకవర్గ ప్ర జలందరు ఐక్యమత్యాన్ని ప్రదర్శించి నిరంజన్ రెడ్డిని మరోసా రి గెలిపించాలని పిలుపునిచ్చారు. వాల్మీకి సోదరులకు ఎస్టి జాబితాలో చేర్చాలని రెండుసార్లు తీర్మానం చేసి పంపితే మోడి ప్రభుత్వం..మొద్దు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నా యకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News