Saturday, April 27, 2024

15న బిఆర్‌ఎస్ మేనిఫెస్టో..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 15వ తేదీన బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేస్తారు. అదేరోజున సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం అదేరోజు నుంచి సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 15న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 16న ఉదయం జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశంలో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై సిఎం కెసిఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

నవంబర్ 9న రెండు చోట్ల సిఎం నామినేషన్ దాఖలు
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నవంబర్ 9వ తేదీన రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కెసిఆర్ నామినేషన్లు సమర్పించనున్నారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో భాగంగా సిఎం కెసిఆర్ వచ్చే నెల 9వ తేదీన ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్లో కెసిఆర్ మొదటి నామినేషన్ దాఖలు చేసి,ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News