Tuesday, May 7, 2024

ఆగస్టు 2న హాలియాకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR will tour the Nallabelli on july 24

ఆగస్టు 2 సిఎం హాలియా పర్యటన
సాగర్ ఉప ఎన్నికల హామీలపై సమీక్ష
సిఎం సభ ఏర్పాట్లలో ఎంఎల్‌ఎ, అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో ఆగస్టు 2న నిర్వహించనున్న నియోజకవర్గ ప్రగతి సమీక్షలో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. సాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చించనున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నారు. సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, మిర్యాలగూడ పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేస్తామని సిఎం ఇచ్చిన హామీపై సమీక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో వరాలు కురిపించిన ముఖ్యమంత్రి ఆ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సందర్బంగా నియోజకవర్గంలో పర్యటించిన సిఎం.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆగస్టు 2న పర్యటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సిఎం కెసిఆర్ పర్యటన ఖరారైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సభాస్థలిని పరిశీలించిన ఎంఎల్‌ఎ
సిఎం కెసిఆర్ వచ్చే నెల 2న హాలియాలో స్థానిక అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమావేశం, సభ ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు, ఎంఎల్‌ఎ మ్మెల్యే నోముల భగత్ స్థలాన్ని పరిశీలించారు. హాలియాలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రాంగణం, మినీ స్టేడియాన్ని పోలీసులు పరిశీలించారు. ఆగస్టు 2న సింఎం రాక సందర్భంగా నూతన ఐటీఐ కళాశాల అయితేనే అన్ని సదుపాయాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ ఉపఎన్నికల వేళ బహిరంగ సభలో నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని మళ్లీ సందర్శిస్తానని సిఎం కేసీఆర్ ప్రసంగంలో తెలిపారు. సిఎం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు
నాగార్జున సాగర్ ఉపఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ఆగస్టు 2న హాలియాలో పర్యటించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుపేదల ఆకలి తీర్చే నాయకుడని కొనియాడారు. నల్గొండ జిల్లాపై కెసిఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని జగదీశ్ రెడ్డి తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పర్యటించని విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను 26 సార్లు సిఎం కెసిఆర్ సందర్శించారన్నారు.

CM KCR to Visit Haliya on August 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News