Wednesday, October 9, 2024

శాంతిభద్రతలపై సిఎం సీరియస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు అధికార వర్గాల సమాచారం. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కొందరు వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం క లిగించడానికి ప్రయత్నిస్తున్నారని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిం చాలని డిజిపి జితేందర్‌ను సీఎం ఆదేశించినట్టు ఈ వర్గాల సమాచారం. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షం పార్టీ నేతలు చేస్తోన్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించినట్టు తెలిసింది. సీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకొన్న ఎమ్మెల్యేలను తలకొండపల్లి, కేశంపేట పోలీసు స్టేషన్లకు తరలించిన సందర్భంగా గురు వారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాల పట్ల సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు ఈ వర్గాల సమాచారం. ఈ అంశంపై డిజిపితో సీఎం ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది.

ముగ్గురు కమిషనర్లతో డిజిపి సమీక్ష
రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీసుల పనితీరు పట్ల సిఎం రేవంత్ సీరి యస్‌గా కావడంతో డిజిపి జితేందర్ శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని మూడు కమిషనరేట్ పరిధిలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించారు. శాంతి భద్రతల పట్ల రాజీపడవద్దని, హైదరాబాద్ బ్రాండ్ ఇమే జీని దెబ్బతీసే శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా డిజిపి ఆదేశిం చారు. రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనర్లకు డిజిపి దిశానిర్దేశం చేసారు. శాంతి భద్రతలకు చిన్నపాటి విఘాతం కలిగినా ప్రభుత్వం సీరి యస్ గా తీసుకుంటుందని డిజిపి హెచర్చించినట్టు తెలిసింది. శాంతి భద్ర తల విషయంలో రాజీ పడే సమస్యే లేదని డిజిపి సీరియస్‌గా చెప్పినట్టు తె లిసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారి పట్ల కఠినంగా వ్యవ హరించాలని డిజిపి ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి పట్ల కేసులు నమోదు చేయాల్సిందిగా డిజిపి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News