Tuesday, April 30, 2024

ఔను మేస్త్రీనే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ‘నేను మేస్త్రినే.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణ ను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రీనే’ అంటూ బిఆర్‌ఎస్ నాయకులపై సిఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మిమ్మల్ని 100 మీటర్ల లోతులో గోరీ కట్టే మేస్త్రీని కూడా తానేనంటూ ఆయన వారికి వార్నింగ్ ఇ చ్చారు. ‘ఈ నెలలోనే ఇంద్రవెల్లి వస్తాను కాస్కోం డి” అంటూ సిఎం రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టే డియంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్స్ సమావేశంలో భాగంగా ఆయ న ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ మరో రెండు హామీల అమలు కోసం ప్రభుత్వం సిద్ధమైందని ఆయన తె లిపారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి 63లక్షల మం దికి రైతు భరోసా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చా రు. గతంలో మార్చి వరకు రైతుబంధు ఆపిన స న్నాసులే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీలు వేస్తామని అందులో బూత్ లెవల్ కమిటీ సభ్యులు నలుగురు ఉంటారని ఆయన తెలిపారు.

కార్యకర్తల చెమటతోనే సిఎం అయ్యా…
కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. వారి చెమటతో తాను సిఎం అయ్యానని సిఎం రేవంత్ అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కాలేదు, వాళ్ల పాలనలో ఏమీ చేయలేని సన్నాసులు బిల్లా రంగాలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి బయల్దేరారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని గత పాలకులు తీసుకొచ్చారని రేవంత్ ఆరోపించారు.
జోడో యాత్రతో టికాంగ్రెస్‌కు లాభం
తనకు ఈ పదవి, హోదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినవే అని ఆయన అన్నారు. కార్యకర్తల కఠోర శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు. వాళ్లు పెట్టిన భిక్షతోనే ఈ రోజు తాను ఈ స్థానంలో ఉన్నానని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తలతో పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ, కర్ణాటకలోకి రావడం చాలా ప్లస్ అయిందన్నారు. ఈ దేశంలో త్యాగం గురించి మాట్లాడే హక్కు ఒక్క నెహ్రూ కుటుంబానికే ఉందని ఆయన చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆయన తెలిపారు. సంక్షోభంలో ఉన్న దేశానికి సోనియా గాంధీ స్థిరత్వాన్ని తెచ్చిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి పదవులు తన వరకు వచ్చినా తీసుకోలేదన్నారు.

సోనియా, రాహుల్‌ను వేధించేందుకే ఈడీ, సిబిఐ కేసులు
యువతకు కంప్యూటర్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌ను వేధించేందుకే ప్రధాని మోడీ ఈడీ, సిబిఐ కేసులు పెడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2004 లో రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. కానీ, రాహుల్ తీసుకోలేదన్నారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి సొంత ఇళ్లు కూడా లేదంటే వాళ్లు ఎలాంటి వాళ్లో అర్థ్ధం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. సొంత ఇళ్లు కూడా కట్టుకోలేని వారికి అవినీతి చేయాల్సిన అవసరం ఏముంటుందని ఆయన వెల్లడించారు.
ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు హామీలు
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం, 50 రోజులు కూడా కాకముందే బిఆర్‌ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితబంధు, బిసి బంధు సహా ఏ హామీని కూడా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.

తెలంగాణను దోచుకున్న వాళ్లకు కెసిఆర్ రాజ్యసభ ఇచ్చారు
తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లను కెసిఆర్ రాజ్యసభ సభ్యులను చేశారని, రూ. 50 వేలు కూడా లేకున్నా 52 వేల మెజార్టీతో గెలుపొందిన మందుల శామూల్‌కు తాము టికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు. కరోనా కాలంలో వేల కోట్లు దోచుకున్న వారిని కెసిఆర్ రాజ్యసభ సభ్యులను చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో చిన్న చిన్న కార్యకర్తలకు టికెట్‌లు ఇచ్చామని వారంతా ఎమ్మేల్యేలు అయ్యారన్నారు. మరి నువ్వు ఎవరికి టికెట్‌లు ఇచ్చావు. కాంగ్రెస్ ఒక దళితుడిని ఏఐసిసి చీఫ్ చేసింది, మరి నువ్వు ఎవర్ని చేశావని రేవంత్ బిఆర్‌ఎస్ నాయకుడిని ప్రశ్నించారు. తాను 17 పార్లమెంట్ స్థానాల్లో సభలు పెడుతానని, మొన్నటి ఎన్నికల్లో మీ పార్టీని ఓడించాం,

ఈ ఎన్నికల్లో తాము గెలిచి బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాం, బిల్లా, రంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్లెస్‌శోభరాజు ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నాడు, పులి బయటకు వస్తుంది అన్నాడు కదా రమ్మని చెప్పండి బోను పట్టుకుని రెడీగా ఉన్నామని రేవంత్ పేర్కొన్నారు. మోడీ, కేడి రెండు ఒక్కటేనని నాణేనికి మోడీ ఒక వైపు కెసిఆర్ మరో వైపు ఉన్నారన్నారు. ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కెసిఆర్ మోడీకి తాకట్టు పెడతారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెసిఆర్ నీ పీక పిసికే బాధ్యత మా పార్టీ తీసుకుందని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రినయ్యానని రేవంత్ తెలిపారు.

మనకు మోడీతో యుద్ధం, గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదు…
మనకు మోడీతో యుద్ధం, గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదు. జనాలు బిఆర్‌ఎస్‌ను ఊరికే ఓడగొట్టలేదు, జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి జనాలు బిఆర్‌ఎస్‌ను ఓడగొట్టారని సిఎం రేవంత్ తెలిపారు. ఏ హామీని అమలు చేయని బిఆర్‌ఎస్ నాయకులకు మమ్ములను అడిగే హక్కు లేదన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బిజెపి పాత్ర ఏంటిదో ప్రస్తుత బిజెపి నాయకులు చెప్పాలని సిఎం డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News