Monday, May 6, 2024

మంచుముంచెత్తిన కశ్మీర్

- Advertisement -
- Advertisement -

Cold wave intensifies in Kashmir

పలు ప్రాంతాలలో మైనస్ డిగ్రీలు
డ్రాస్‌లో 13తో చలితీవ్రత
పర్యాటక గుల్మార్గ్‌లో గిజగిజ

శ్రీనగర్ : కశ్మీర్ చలితీవ్రతతో బిగుసుకుపోతోంది. ఈ చలికాలంలో రికార్డు స్థాయిలో రాజధాని శ్రీనగర్‌లో అత్యల్పంగా మైనస్ 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్ని మంచుదుప్పట్లు పర్చుకున్న వైనాన్ని గుర్తుకు తెస్తున్నాయి. కశ్మీర్‌లో పలు ప్రాంతాలలో హిమపాతాలు, చలిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్రీనగర్‌లో జనసంచారం దాదాపుగా లేకుండా పోయింది. ఇదో రకం లాక్‌డౌన్ అనుభవం అని ప్రజలు నిట్టూరుస్తున్నారు. గాలిలో తేమ శాతం మరింతగా పెరుగుతుందని, దీనితో ఉష్ణోగ్రతలు రానున్న వారం రోజుల వరకూ అంటే దాదాపు ఈ నెల 23వ తేదీ వరకూ అల్ప అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. శ్రీనగర్, డ్రాస్‌లలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల స్థాయికి పడిపోవడంతో దేశంలోనే ఈ శీతాకాలంలో ఈ ప్రాంతాలే అత్యంత శీతల ప్రాంతాలుగా మారాయి.

ఈ నెల 23వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని త్వరలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు -2 నుంచి 3 వరకూ నమోదు అవుతాయని వాతావరణ పరిశీలకులు తెలిపారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు పలు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం ఫల్గామ్‌లో మైనస్ 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. కశ్మీర్ లోయలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. ఇక్కడ మంచు తప్ప రాదార్లు కన్పించని స్థితి ఏర్పడింది. ఇక ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారాలో మైనస్ 2.0 , ప్రపంచ ప్రఖ్యాత స్కి రిసార్ట్ గుల్మార్గ్‌లో మైనస్ రెండు స్థాయి టెంపరేచర్లు నమోదు అయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతం లేహ్‌లో అత్యల్పంగా మైనస్ 8.1 డిగ్రీలు, కార్గిల్‌లోని డ్రాస్‌లో మైనస్ 13 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ విధంగా ఈ ప్రాంతం ప్రపంచంలోనే రెండో అత్యల్ప ఉష్ణోగ్రతల ప్రాంతం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News